India puts 303 runs target to bangladesh

India versus Bangladesh, India vs Bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, bangaldesh, India, Australia, pakistan, newzealand, west indies, bangaldesh, bangaldesh CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

india puts 303 runs target to bangladesh as rohit, raina crush bangladesh bowlers

బంగ్లాకు 303 విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా

Posted: 03/19/2015 12:41 PM IST
India puts 303 runs target to bangladesh

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా బంగ్లదేశ్ తో జరగనున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్ లో టీమిండియా చివరి ఓవర్లలో ధాటిగా ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు విక్కెట్లు నష్టపోయి బంగ్లాదేశ్ ముందు 303 పరుగులు విజయలక్ష్యాన్ని వుంచింది. తొలి ముఫై ఓవర్లలో తడబాటుకు గురైన ధోణిసేన ఆ తరువాత చివరి ఓవర్లలో కోలుకుని బంగ్లాదేశ్ బౌలర్లు ఉతికి ఆరేసింది. ముఖ్యంగా టీమిండియా స్కోరు బోర్డును రోహిత్ శర్మ, సురేష్ రైనాలు పరుగులు పెట్టించారు.  126 బంతులను ఎదుర్కోన్న రోహిత్ ధాటిగా ఆడి.. 14 ఫోర్లు, మూడు సిక్స్ ల సాయంతో  137 పరుగులు సాధించాడు. అటు సురేష్ రైనా కూడా బంగ్లా బౌలర్లను చితకబాదాడు. 57 బంతులను ఎదుర్కోన్న రైనా.. 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 65 పరుగులను సాధించాడు. చివరి పది ఓవర్లలో భారత్ 97 పరుగులు సాధించింది.

ఓపెనర్ శిఖార్ ధావన్ 30 పరుగులు చేసి 16.3 ఓవర్లో 30 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలీయన్ చేరాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన అజ్యింక రహానే అచితూడి ఆడుతూ రోహిత్ శర్మతో కలసి నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యి వెనుదిరిగడంతో క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా ధాటిగా ఆడుతూ బంగ్లా బౌలర్లను కంగారు పెట్టించాడు. చివరిలో వచ్చిన జేడాజా కూడా ధాటిగా ఆడి కేవలం 8 బంతులలోనే ఒక్క పోరు సాయంతో 21 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 302 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ మూడు విక్కెట్లను చేజిక్కించుకోగా, మొర్తాజా, రుబెల్, షకీబ్ తలో వికెట్ సాధించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  bangaldesh  

Other Articles