Ap assembly speaker suspended eight ysrcp mlas from house

suspention, ysrcp, jagan, kodela, ramakrishnudu, ap, assenbly

ap assembly speaker suspended eight ysrcp mlas from house. speaker kodela shivaprasad suspend eight mlas on the proposal of finance minister yanamala ramakrishnudu. jagan oppose the behaviour of speaker. he said that he will complaint to the governor.

అయ్యో పాపం.. ఎమ్మెల్యేలను గెంటేశారు

Posted: 03/19/2015 12:50 PM IST
Ap assembly speaker suspended eight ysrcp mlas from house

ఏపి అసెంబ్లీలో దూషణల పర్వం సా...గుతూనే ఉంది. అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికే వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గందరగోళం సృష్టించారు. దాంతో సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు స్పీకర్. కాగా బ్రేక్ తరువాత కూడా పరిస్థితి ఏం మారలేదు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్ఆర్ సీపీ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం చెయ్యగా.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేశారు. ఈనెల 23 వరకూ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కొనసాగనుంది. గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి), ముత్యాల నాయుడు (మాడుగుల), కొడాలి నాని (గుడివాడ), సీహెచ్. జగ్గిరెడ్డి (కొత్తపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు), చాంద్ బాషా (కదిరి) ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.  

స్పీకర్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు బడ్జెట్పై మాట్లాడుతుండగానే సమయం ముగిసిందంటూ మైక్ కట్ చేయటం బాధాకరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఇలాంటి స్పీకర్ను ఎప్పుడూ చూడలేదని, అధికార పక్షం చెప్పినట్లుగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మొత్తానికి మొన్న తెలంగాణ అసెంబ్లీలో పది మంది టిటిడిపి ఎమ్మెల్యేలను సస్సెన్డ్ చెయ్యగా, తాజాగా ఏపిలో వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది సస్పెన్షకు గురి కావడం విశేషం.

అయితే సస్సెండ్ అయిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ గవర్నర్ ను కలవనున్నారు. సభలోంచి వెంటనే వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించిన వెంటనే మార్షల్స్ వైయస్ఆర్ సిపి ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా తీసుకెళ్లారు. అయితే మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను మార్షల్స్ తోయడంతో చెవిరెడ్డి కిందపడ్డారు. మొత్తం ఘటనపై జగన్ మండిపడుతున్నారు. సభలో ఇది చీకటి రోజు అని జగన్ వ్యాఖ్యనించాడు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suspention  ysrcp  jagan  kodela  ramakrishnudu  ap  assenbly  

Other Articles