Kodali nani commented on behaviour of their party mlas in assembly

kodalinani, ysrcp, assembly, ap, jagan, ysrcongress, speaker

kodali nani commented on behaviour of their party mlas in assembly. in ap assembly ysrcp mlas suspended from assembly. the ysrcp mla kodali nani suppoted his behavour in the house.

డౌన్ డౌన్ అనే కదా అన్నాం.. బూతులు తిట్టలేదు కదా

Posted: 03/19/2015 01:34 PM IST
Kodali nani commented on behaviour of their party mlas in assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తమ గొంతు నొక్కుతున్నారని, సభలో ఏం మాట్లాడాలో స్పీకరే నిర్ణయిస్తే ఎలా అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ నేత వైయస్ జగన్ మండిపడ్డారు. సస్పెండ్ కు గురైన వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతొ కలిసి ఆయన అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. అయితే మీడియా పాయింట్ వద్ద మాట్లాడతున్న తమ ఎమ్మెల్యేలను దురుసుగా లాగారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై గవర్నర్ ముందుకు వెళ్లనున్నారు.

అయితే సభలో స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. స్పీకర్ మాకు మాట్లాడటానికి ఎలాంటి అవకాశం ఇవ్వనపుడు ఇలా చెయ్యకపోతే ఎలా చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమ గొంతు వినపించకుండా చేసినందుకు స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశామని కొడాలి నాని తెలిపారు. అయినా స్పీకర్ కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అని మాత్రమే కదా అన్నాం.. బూతులు తిట్టలేదు కదా అని ఎదురు ప్రశ్న వేశారు. మొత్తానికి డౌన్ డౌన్ అని మాత్రమే అన్నందుకు బాధపడ్డారో.. బూతులు తిట్టనందుకు ఆనంద పడ్డారో మాత్రం ఆమనకే తెలియాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodalinani  ysrcp  assembly  ap  jagan  ysrcongress  speaker  

Other Articles