Aap convenor trying to end the crisis in aap

aap, kejriwal, prashanthbhjushan, yogenderyadav, delhi

aap convenor trying to end the crisis in aap. Could it be? Is the headline grabbing AAP rift coming to a less than acrimonious end? Signs of reconciliation seemed to be in the air, when Aam Aadmi Party chief Arvind Kejriwal on Tuesday agreed to meet Yogendra Yadav and Prashant Bhushan, a day after they had extended an olive branch.

'ఆప్' కా క్యా హోగా.. ట్రైయాంగిల్ కు తెరా?

Posted: 03/17/2015 05:02 PM IST
Aap convenor trying to end the crisis in aap

ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభానికి తెరదించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లతో రాజీకి అరవింద్ కేజ్రీవాల్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. పార్టీలో అందరిని ఒక్కతాటిపై నిలపాలని  కేజ్రీవాల్ వర్గీయులు భావిస్తున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా ఒక రాజీ ఫార్ములాను రూపొందిస్తారని తెలుస్తోంది. బెంగళూరులో వైద్యం చేయించుకొని ఢిల్లీ తిరిగి వచ్చిన కేజ్రీవాల్ ఆప్ లో సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు. యోగేంద్ర యాదవ్, ప్రవాంత్ భూషణ్ లతో ఘర్షణ పడకుండా రాజీ పడాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగానేకేజ్రీవాల్ పలువురు నేతలను యోగేంద్ర యాదవ్ నివాసానికి పంపారు. కుమార్ విశ్వాస్, అశుతోష్, ఖేతాన్ తదితర నాయకులు యాదవ్ నివాసాని వెళ్లి, రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి చర్చలు ఆరంభమయ్యాయనివారు వివరించారు.

సీనియర్ నేత ప్రశాంత్ భూషణ్ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో చర్చించాలని సందేశం పంపారు.  తాను, యాదవ్ లేవనెత్తిన అంశాలపై పార్టీలో చర్చ జరగాలని, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, సింగిల్ పర్సన్ పార్టీగా కొనసాగ కూడదని భూషణ్ అన్నారు. అయితే భూషణ్ తో భేటీకి కేజ్రీవాల్ కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి గత కొంత కాలంగా ఆప్ లో తలెత్తిన వివాదాలు త్వరలోనే ముగిసిపోతాయని ఆప్ కార్యకర్తలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  prashanthbhjushan  yogenderyadav  delhi  

Other Articles