Producer dilraju elected as president for telangana movie chamber of commerce

dilraju news, dil raju latest news, dil raju photos, dil raju history, dil raju videos, dil raju movies, telangana movie chamber of commerce

producer dilraju elected as president for telangana movie chamber of commerce

నిర్మాత దిల్ రాజుకు వరించిన ఆ అధ్యక్ష పదవి

Posted: 03/17/2015 05:54 PM IST
Producer dilraju elected as president for telangana movie chamber of commerce

నిర్మాత దిల్ రాజు.. ఇండస్ట్రీలో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ తన కెరీర్ ని ప్రారంభించి ప్రముఖ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. తొలుత తమిళంలో మణిరత్నం తెరకెక్కించిన ‘అమృత’ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్న రాజు.. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా అవతారమెత్తారు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించడంతో అప్పటి నుంచి ఈయనకు ‘దిల్’ రాజు అనే పేరు వచ్చింది. ఆ సినిమా ఈయనకు మంచి వసూళ్లు రాబట్టింది కూడా! దీంతో ఆయన స్టార్ హీరోలతో సినిమాలు తీయడం ప్రారంభించారు.

కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ భారీ బడ్జెట్టు సినిమాలను నిర్మించారు రాజు! ఫ్యామిలీ, కామెడీ, మాస్ తరహాలాంటి ఎన్నో కథాచిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఒక చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ నేడు అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ నిర్మాతకు ఓ అరుదైన గౌరవం లభించింది. ఈయన తెలంగాణ మూవీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారని తాజా సమాచారం! ఇక ఉపాధ్యక్షుడిగా విజేందర్ రెడ్డి, సలహాదారుడిగా బి.నర్సింగరావులు ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : dil raju news  telangana movie chamber of commerce  

Other Articles