Puri jagannadh house theft theif caught jubileehills police

puri jagannadh news, puri jagannadh house theft, puri jagannadh home theft, puri jagannadh homemade, puri jagannadh case, puri jagannadh jubileehills police station, puri jagannadh wife, puri jagannadh family members, puri jagannadh movie updates

puri jagannadh house theft theif caught jubileehills police : Finally jubileehills police chase the theft case of director puri jagannadh's. The home made had theft those jewellery.

దర్శకుడు పూరీ ఇంటిని దొంగలించిన వారెవరో తెలిసింది!

Posted: 03/17/2015 11:45 AM IST
Puri jagannadh house theft theif caught jubileehills police

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట్లో ఇటీవలే భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే! రూ. 1.5 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో తమ ఇంట్లో ఆభరణాలు చోరీ అయ్యాయని పూరీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దొంగలు ఎవరో కనుగునేదిశగా తమ విచారణను వేగవంతం చేశారు. చివరగా.. ఈ కేసును ఛేదించి ఆ దొంగతనం చేసిందెవరో కనుగొన్నారు.

పూరీ ఇంట్లో పనిచేసే పనిమనిషే ఆ బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఇదే విషయాన్ని స్వయంగా పూరీ మీడియాకు తెలిపారు. నగలు పోయినందుకు తమకు కోపం లేదని, కానీ తమ పనిమనిషి నమ్మకద్రోహానికి పాల్పడినందుకు తన భార్య చాలా బాధపడిందని ఆయన వెల్లడించారు. దొంగిలించిన నగలను పనిమనిషి తన బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చిందని, ప్రస్తుతం అతగాడు పరారీలో వున్నాడని వివరించారు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారని పూరీ వివరించారు.

ఈ దొంగతనానికి పాల్పడ్డ పనిమనిషి తమ ఇంట్లో గతనాలుగేళ్లుగా పనిచేస్తోందని స్పష్టం చేసిన పూరీ.. ఆమె తమకు ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదని బాధపడుతూ అన్నారు. తామంతా ఆమెను ఎంతగానో నమ్మామని, కానీ ఆమె తమ నమ్మకాన్ని ఒమ్ము చేసిందని అన్నారు. తన భార్య ఇంట్లో లేని సమయంలో లాకర్ తాళాన్ని దొంగిలించి, ఆమె నగలను కాజేసి వుంటుందని పూరీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles