Secendrabad railway station providing wifi for passengers

secendrabad, wifi, facility, southcentralrailway

secendrabad railway station providing wifi for passengers. soth central railway center secunderbad got wifi facility.

సికింద్రాబాద్ స్టేషన్ లో వైఫై వచ్చిందోచ్..

Posted: 03/17/2015 11:35 AM IST
Secendrabad railway station providing wifi for passengers

రైల్వేలను అధునీకరించి, అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే మంత్రి ఇచ్చిన హామీ ఇప్పుడిప్పుడు అమలుకు నోచుకుంటోంది. దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చేసింది. ఈ సౌకర్యం అరగంటపాటు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో వుంటుంది. ఆ తర్వాత వైఫై నిలిచిపోతుంది. దశలవారీగా ఈ సౌకర్యాన్ని మిగతా స్టేషన్లకూ విస్తరించాలని రైల్వేశాఖ భావిస్తోంది. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో సుమారు  కాచిగూడ, నాంపల్లి, కాజీపేట, వరంగల్, కరీంనగర్, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలను కలుపుకొని మొత్తం 10 స్టేషన్లలో వైఫైని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది.

ఉచిత వైఫై సదుపాయం కోసం దేశంలోని ఆరుస్టేషన్లను రైల్వేశాఖ ఎంపిక చేసింది. అందులో సికింద్రాబాద్‌తోపాటు ముంబై, ఆగ్రా, వారణాసి, అహ్మదాబాద్, హౌరా స్టేషన్లు వున్నాయి. ఇటీవల ఈ సౌకర్యాన్ని రైల్వే అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వైఫై ఏర్పాటుకు దాదాపు 50 లక్షలను కేటాయిస్తున్నట్లు గతంలోనే రైల్వే మంత్రి ప్రకటించారు. మొత్తానికి చాలా కాలం తరువాత రైల్వేల్లో వైఫై అమల్లోకి వచ్చింది. అయితే కేవలం అర గంట మాత్రమే ప్రయాణికులకు వైఫై అందుబాటులో ఉండటం పై కాస్త అసంతృప్తిగా ఉన్నా, త్వరలోనే దాన్ని పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. మరి గంటల కొద్ది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వేచి ఉండే వారికి వైఫై ఎంతో ఉపయోగపడుతుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : secendrabad  wifi  facility  southcentralrailway  

Other Articles