Trs govt plans to get hyderabad in up coming elections

hyderabad, kcr, trs, elections, mim, congress, tdp

trs govt plans to get hyderabad in up coming elections. kcr concentrate on hyderabad sice he became telanagana cm.

హైదరాబాద్ లో టిఆర్ఎస్ జెండా ఎగిరేనా..?

Posted: 03/16/2015 10:02 AM IST
Trs govt plans to get hyderabad in up coming elections

హైదరాబాద్ లో టిఆర్ఎస్ జెండా పాతేందుకు కెసిఆర్ అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న బల్దియా ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రావడానికి చర్యలు కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా గత కొంత కాలంగా విశ్వనగరంగా హైదరాబాద్ అన్న నినాదాన్ని మరింతగా ప్రచారం చెయ్యడానికి కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ కు ఎక్కువ నిధులను కేటాయించడం ద్వారా నగరవాసి మనసులను గెలుచుకునేందుకు ప్రయత్నించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పట్టున్నా, హైదరాబాద్ లో మాత్రం టిఆర్ఎస్ కు గట్టిగా పట్టులేకపోవడంతో, టిఆర్ఎస్ శ్రేణులు గత కొంత కాలంగా అంతర్మదనంలో పడ్డాయి. అయితే ఎన్నికలపై కెసిఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో బల్దియా ఎన్నికలు రంజుగా మారనున్నాయి.

హైదరాబాద్ లోని ఉస్సేన్ సాగర్ ను పూర్తిగా శుద్ది చెయ్యడం, కొత్తగా రవీంద్రభారతి, సెక్రటేరియట్ నిర్మాణాలను చేపట్టడం, నగర పోలీస్ వ్యవస్థలో మార్పుల్లాంటి అనేక కోణాల్లో కెసిఆర్ ప్రభుత్వం సగటు నగరవాసికి చేరువైంది. అయితే నగర వాసి ఓటును దక్కించుకుంటుందా లేదా అనేది ఎన్నికల తర్వాత కానీ తేలదు. అయితే కొన్ని మురికి వాడల్లో కెసిఆర్ స్వయంగా తిరిగి అక్కడి పరిస్థితిని చక్కదిద్దడం, తగిన సౌకర్యాలను కల్పించడం లాంటి పనులను చేస్తున్నారు. హైదరాబాద్ చూడడానికి బాగా అనిపిస్తున్నా, లోపల మాత్రం చెత్తగా ఉందని అంటున్నారు. దాన్ని పూర్తిగా మార్చడానికి తాను నడుంబిగించానని అంటున్నారు. మరి మొత్తానికి కెసిఆర్ హైదరాబాద్ లో టిడిపి, కాంగ్రెస్, ఎంఐఎం లాంటి పార్టీలను కాదని ఎలా ఓట్లను సంపాదిస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  kcr  trs  elections  mim  congress  tdp  

Other Articles