Telanagana irrigation minister fire on congress

congress, harishrao, telangana, assembly

telanagana irrigation minister fire on congress. in the telangana assembly sessions harish rao answered a question on bhadrachalam seven mandals, lower selaru.

కాంగ్రెస్సే దానికి కారణం: హరీష్ రావ్

Posted: 03/16/2015 11:14 AM IST
Telanagana irrigation minister fire on congress

భద్రాచలంలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించడాన్ని రాజ్యసభలో సంఖ్యాబలం ఉండికూడా కాంగ్రెస్ అడ్డుకోలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా లోయర్ సీలేరు ప్రాజెక్టు, ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలపడంపై కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశ్నపై సభలో చర్చ సందర్భంగా మంత్రి హరీష్‌రావు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ వల్లే లోయర్ సీలేరు ప్రాజెక్టు ఏపీకి వెళ్లిందని, బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఆ ఏడు మండలాల ప్రజల అన్యాయానికి కారణం కాంగ్రెస్సే. జైరాం రమేష్ వల్లే ఈ ప్రాజెక్టు ఏపీకి చేరిందని. లోయర్ సీలేరు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు.

రాష్ర్టానికి రావాల్సిన వాటాపై కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. లోయర్ సీలేరులో వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను ఖచ్చితంగా తీసుకుంటామని  తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావ్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  harishrao  telangana  assembly  

Other Articles