Seven men dead in collapse of roof of cement factory

bangladesh, cement factory, collapse,

seven men dead in collapse of roof of cement factory. The death toll from the collapse of the roof of a five-story cement factory in Bangladesh rose to at least seven Friday, a government official said.

బంగ్లాదేశ్ లో కూలిన బిల్డింగ్.. ఏడుగురు మృతి

Posted: 03/13/2015 12:58 PM IST
Seven men dead in collapse of roof of cement factory

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీ పై కప్పు కూలి ఏడుగురు మృతి చెందారు. కాగా చాలా మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఫ్యాక్టరీలో మొదటి అంతస్తుతో దాదాపు 50 నుండి 60 మంది పనిచేస్తుండగా, హఠాత్తుగా కూలి పోయింది. దాంతో కింద పని చేస్తున్న వారిలో కొందరు, పై కప్పులోని వారు కొందరు మృతి చెందారు.

అయితే ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడి చేరుకొని, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కాగా అదికారులు ఏడు గురు మాత్రమే చనిపోయినట్లు చెబుతున్నా, ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ లో బిల్డింగ్ లు కూలిన ఘటనలు మరీ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 2013 నుండి ఇప్పటి దాకా దాదాపు 1100 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  cement factory  collapse  

Other Articles