Park street rape survivor suzette jordan died

Suzette Jordan, Park Street Rape, West Bengal,Kolkata

A rape survivor who took on the West Bengal government in her fight for justice in the case that came to be known as the "Park Street Rape" has died. Suzette Jordan, 40, died of meningoencephalitis at a hospital in Kolkata.

పార్క్ స్ట్రీట్ రేప్ బాధితురాలు మృతి

Posted: 03/13/2015 12:21 PM IST
Park street rape survivor suzette jordan died

రామాయణంలో రావణకాండలా నేడు భారతదేశంలో నిర్భయకాండ నడుస్తోంది. 2012 ఫిబ్రవరిలో అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు అనారోగ్య కారణాలతో మరణించింది. ప్రభుత్వంపై అత్యాచారాల గురించి పోరాటం చేసిన ఆ బాధితురాలు, తన పోరాటాన్ని మధ్యలోనే వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. సుజీటి అనే యువతి 2012 ఫిబ్రవరిలో కలకత్తాలోని ఓ క్లబ్ నుండి రాత్రి బయటికి  వస్తుండగా, స్నేహితుడు లిఫ్ట్ ఇస్తానంటూ కార్ ఎక్కించుకొని దారుణంగా రేప్ చేశాడు. తరువాత ఆమెను కారులోంచి తోసేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో తీవ్ర సంచలనం రేపింది.

అయితే ముఖ్యమంత్రి గా పని చేస్తున్న మమతా బెనర్జీ మాత్రం ఘటనలో అత్యాచార బాధితురాలిదే తప్పు అంటూ తీవ్రంగా విమర్శించింది. బాధితిరాలు మాత్రం ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాన్ని నిరసిస్తు పలు కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పలు అవయవాలు ఆమెకు సహకరించడం లేదు. దాంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో ఆమె మృతి చెందింది. కాగా బాధితిరాలి పోరాటాన్ని తాము కొనసాగిస్తామని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అత్యాచార ఘటనల్లో ఇదే చివరి చావు కావాలని కోరుకుందాం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suzette Jordan  Park Street Rape  West Bengal  Kolkata  

Other Articles