Ap budget a massive cover up ys jagan

AP Budget, a massive cover-up: YS Jagan, Yanamala Ramakrishnudu tables first year long budget, Yanamala first year long budget, AndhraPradesh budget 2015-16, Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu, AndhraPradesh budget, AndhraPradesh Assembly, AndhraPradesh CM chandrababu Naidu, Leader of the Opposition YS Jagan Mohan Reddy,

Leader of the Opposition in the Andhra Pradesh Assembly YS Jagan Mohan Reddy described the AP budget, a massive cover-up

అంతా అంకెల గారడీయే.. దాచిపెట్టే ప్రయత్నమే

Posted: 03/12/2015 03:31 PM IST
Ap budget a massive cover up ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015-16 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంతా అంకెల గారడీగా వుందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా విమర్శించారు. యనమల రామకృష్ణుడు తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతా దాచిపెట్టే పరయత్నమే చేసిందని ఏమీ కనిపించే అవకాశాల్లేవని ఆయన మండిపడ్డారు. బడ్జెట్లో అన్నీ సత్యదూరమైన మాటలేనని, అన్నీ కవరప్ చేసుకునే ఆలోచనలేనని ఆయన అన్నారు. ఫలానా పథకానికి గొప్పగా కేటాయింపులు చేశామని చెప్పుకొనే పరిస్థితి లేదని చెప్పారు. బడ్జెట్ అంశాలపై పూర్తిగా ఇంకా లోతుల్లోకి వెళ్లలేదని, దీనిపై 16వ తేదీన ప్రసంగం చేస్తానని వైఎస్ జగన్ తెలిపారు.

వ్యవసాయ రుణాలకు ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వబోతారో చెప్పలేదని, శాఖల వారీగా రెవెన్యూ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు చేశారన్నది లోతుగా చూడాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. ఆర్థికలోటు రూ. 20 వేల కోట్లు అన్నారు గానీ, ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం 3 శాతం జీఎస్డీపీ కన్నా రుణం తెచ్చుకునే అవకాశం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. మరి రూ. 20 వేల కోట్లు అంటే.. మూడు శాతం దాటినట్లే కదా అని విశ్లేషించారు. అలాగే, డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ ఎంతో లేదని, గతం గురించి చెప్పారు గానీ, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో చెప్పలేదని విపక్ష్ నేత జగన్ దుయ్యబట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APbudget 2015-16  AndhraPradesh Assembly  YS Jagan Mohan Reddy  

Other Articles