In a major haul officials today recovered 1 2kg of gold at the airport in rajivgandhi international airport

shanshabad, gold, hyderabad, smagling, airport

In a major haul, officials today recovered 1/2kg of gold at the airport in rajivgandhi international airport. in omen airlines airoplane from mascat to shamshabad carrys 1/2 kg gold. customs officials seazed the gold.

విమానాశ్రయాల్లో బంగారం

Posted: 03/12/2015 03:33 PM IST
In a major haul officials today recovered 1 2kg of gold at the airport in rajivgandhi international airport

బంగారానికి భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఎంతో విలువుంది. అయితే చైనా, భారత్ లో మాత్రం అన్ని దేశాల కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే దీన్ని కొందరు వ్యక్తులు వ్యాపారం కింద మార్చుకుంటున్నారు. విదేశాలలో దొరికే బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా దేశానికి తరలిస్తున్నారు. అయితే ఇలా దేశానిిక తరలించే క్రమంలో విమానాశ్రయాల్లో, కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు.  తాజాగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 58 తులాల బంగారాన్ని పట్టుకున్నారు.  ఓమన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.  ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయడంతో ఓ ప్రయాణికుని నుంచి 584 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న కస్టమ్స్ అధికారులు  9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఒక ప్రయాణికుడు 9 కిలోల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఒక బ్యాగులో స్పైస్ జెట్ విమానంలో సీటు కింద పెట్టి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలో ఈ బంగారం బయటపడిందని, అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మార్చిలో దాదాపు 20 కిలోల బంగారాన్ని ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారంటే, సంవత్సరానికి ఎన్ని కిలోల బంగారం వస్తుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యమా, స్మగ్లర్లు రెచ్చిపోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇంతలా అధికారులు తనిఖీలు చేస్తున్నా, అరకొరగానే బంగారం రవాణాను అడ్డుకుంటున్నారన్నది విమర్శ. మరి భారత ప్రభుత్వం ఎప్పటికి స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shanshabad  gold  hyderabad  smagling  airport  

Other Articles