Yanamala allocates 33 252 acres rs 3 168 crores for new capital

Yanamala allocates 33,252 acres, Rs. 3168 crores for new capital, Yanamala Ramakrishnudu tables first year long budget, Yanamala first year long budget, AndhraPradesh budget 2015-16, Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu, AndhraPradesh budget, AndhraPradesh Assembly, AndhraPradesh CM chandrababu Naidu

Yanamala allocates 33,252 acres, Rs. 3,168 crores for new capital

రాజధాని కోసం 33, 252 ఎకరాలు, రూ. 3,168 కోట్లు

Posted: 03/12/2015 03:07 PM IST
Yanamala allocates 33 252 acres rs 3 168 crores for new capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం 33,252 ఎకరాలు కేటాయించిందని ఇందుకోసం ఇప్పటికే 87 శాతం మంది రైతులు భూ సేకరణకు అంగీకరించారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం ఏడువేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో అభివృద్ధి చేసిన భూమిని రైతులకు అప్పగిస్తామని యనమల తెలిపారు. అలాగే రైతులకు పరిహారం చెల్లించడానికి సీఆర్డీఏకు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి 3 వేల 168 కోట్ల రూపాయలను తన బడ్జెట్ లో కేటాయించారు.

ప్రస్తుతం పన్నుల ద్వారా సమకూరే ఆదాయం.. జీతాలు, రోజువారీ ఖర్చులకే సరిపోతోందని యనమల అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కున్న ప్రత్యేక సమస్యల్ని పట్టించుకోలేదని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.  మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిపారని, ఇవి రాష్ట్ర ప్రగతికి దోహదపడే స్థాయిలో లేవని యనమల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన, విభజన తీరుతో రాష్ట్రం సంక్లిష్టంగా తయారైందని  ఆవేదన వ్యక్తం చేశారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ మిగులు నుంచి లోటు రాష్ట్రంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని యనమల సూచించారు.

కాగా బడ్జెట్ లో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు 2015-16 వార్షిక ఆర్థిక బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు యనమల. అలాగే గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది.  రెండోదశ రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని యనమల రామకృష్ణుడు తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. సాగునీరు, వరద నియంత్రణకు రూ.5,258 కోట్లు కేటాయించారు. గ్రామీణ నీటి సరఫరా రూ. 881 కోట్లు, పంచాయతీ రాజ్ రూ.3296 కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి యనమల ప్రకటించారు.

ఇక అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో వున్న యనమల.. తన ఆర్థిక బడ్జెట్ 2015-16  బడ్జెట్ లో కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.37 కోట్లు, పోలీస్ సంక్షేమానికి రూ.40 కోట్లు, వికలాంగులకు రూ.81 కోట్లు కేటాయించనున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP budget 2015-16  AndhraPradesh Assembly  Yanamala Ramakrishnudu  

Other Articles