అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఫరాహ్ ఖాన్, కరణ్ జోహార్ వంటి సినీ దిగ్గజాలు ట్విట్టర్లో స్పందించారు. ప్రతిరోజునూ మహిళలకు అంకితం చేయండని ప్రముఖ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. మహిళలను గౌరవించే సమాజం మనది.. వారి అభ్యన్నతిని కాంక్షించడం మనందరి ధర్మం అంటూ ఆయన ట్విట్ చేశారు. కాగా అమితాబ్ బచ్చన్ ట్విట్ పై బాలీవుడ్ అందాల నటి సోనాక్షి సిన్హా స్పందించారు.
కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే మహిళలకు అంకితం చేయబడింది? కానీ మహిళలు ప్రతి రోజూ తమ జీవితాన్ని అంకితం చేస్తారు అని అమితాబ్ బచ్చన్ ట్వీటగా.. మేమంతా ప్రతిరోజూ సాధికరతతో ముందుకొస్తున్నాం.. మాకు ఒక్కరోజే అంకితం చేయడమా.. ఒక్కరోజే కాదు మేమంతా ప్రతిరోజూ జరుపుకుంటాం.. ఆ శక్తి మాకు ఉంది అంటూ నటి సోనాక్షి సిన్హా అన్నారు. మనదేశంలో మహిళలను దుర్గా శక్తితో సమానంగా భావిస్తారు.
మీరంతా(పురుషులు) వారి సహకారంతో కష్టాలను దాటుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. అందరు అనుకునేదానికంటే కూడా మేం చాలా శక్తిమంతమైన వాళ్లం' అని ప్రముఖగాయని లతా మంగేష్కర్ అన్నారు. మరోపక్క నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం ఎత్తివేయాలని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | వర్షం పడుతున్నప్పుడు. లేదా రోడ్డుపై నీళ్లు నిలిచినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్థానిక పురపాలక సంఘం అధికారులతో పాటు.. విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్థంబాలను... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more