Two prostitutes escaped from police custody

Two prostitutes escaped from police custody, prostitutes escaped from police custody, prostitutes escaped, Hyderabad crime, jawaharNagar, sex rocket, 4 arrested, 2 escaped,

prostitutes escaped from police custody in hyderabad

పోలిస్ స్టేషన్ నుంచి ఇద్దరు వ్యభిచారిణుల పరార్..!

Posted: 03/08/2015 05:19 PM IST
Two prostitutes escaped from police custody

సరిగ్గా మహిళా దినోత్సవం రోజన ఇద్దరు మహిళలు తమకు తాము స్వతంత్రులుగా పరిగణించుకున్నారో ఏమో.. ఏకంగా పోలిస్ స్టేషన్ నుంచి పరారయ్యారు. మహిళలు పోలిస్ స్టేషన్ నుంచి ఎలా పరారయ్యారు..? ఇంతకీ వారు పోలిస్ స్టేషన్ కు ఎందుకెళ్లారు..? అన్న సందేహాలు మీ మదిని తొలుస్తున్నాయా..? వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలో జవహార్ నగర్ లో వ్యహిచారం నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వారు సదరు వ్యభిచార గృహంపై అకస్మాత్తుగా దాడి చేసి నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆదివారం ఉదయం ఎఫ్ ఐ ఆర్ నడుపుతున్న సమయంలో ముగ్గురు వ్యభిచారిణిలలో నుంచి ఇద్దరు మహిళలు పరారయ్యారు. ఈ ఘటనతో తెల్లముఖం వేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. నేరగాళ్లు సింహస్వప్నంగా వుండే పోలీసుల కస్టడీ నుంచి ఇద్దరు వ్యభిచారిణులు తప్పించుకోవడంతో.. వారు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitutes escaped  Hyderabad crime  jawaharNagar  

Other Articles