Homeministry takes strong exception to interview

nirbhaya, interview, bbc, homeministry, mukhesh, teharjail

Home Minister Rajnath Singh on Tuesday took strong exception to a British film maker interviewing December 16 gangrape convict Mukesh Singh in Tihar jail, and sought a detailed report from the jail chief on the whole issue.

అతడి ఇంటర్వూకు అనుమతి ఎలా వచ్చింది??

Posted: 03/03/2015 03:56 PM IST
Homeministry takes strong exception to interview

నిర్భయ ఘటనలొ కీలక నిందితుడు ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూ ఉదంతం  కలకలం రేపుతోంది.  అత్యాచారానికి పాల్పడితే చేయించుకోవాలి తప్ప, ప్రతిఘటించకూడదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసి కి  ఇంటర్య్వూఇచ్చాడని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది.  ఆ ఇంటర్వ్యూలో అత్యాచారాలకు అమ్మాయిలదే ప్రధాన బాధ్యత అంటూ  ముఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై హోం మంత్రిత్వ శాఖ నష్ట నియంత్రణ చర్యల్లో పడింది. ఏ నిబంధనల ప్రకారం అతని ఇంటర్వ్యూకు ఆమోదం తెలిపారో చెప్పాలంటూ తీహార్ జైలు అధికారులను హోం మంత్రిత్వ శాఖ వర్గాలు అదేశించినట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా వుంటే  డాక్యుమెంటరీ తీసిన వ్యక్తి నిబంధనలను వ్యతిరేకించారని,  ఈ ఇంటర్యూ బైటపెట్టే ముందు  సంబంధిత వీడియోను తమకు చూపించలేదన్న తీహార్ జైలు అధికారులు  ఆరోపణలను  హోంమంత్రిత్వశాఖ  పరిశీలిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు. భారతదేశంలోని చట్టాల్లోని లోపాల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిర్భయ తల్లి  ఆరోపించారు.  అమ్మాయిలకు రక్షణ ఎక్కడుందని  ఆవేదన వ్యక్తం చేశారు.  నిర్భయ  తండ్రి కూడా ఈ సంఘటనపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు మహిళల   స్వేచ్ఛను వ్యతిరేకిస్తారని, అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కడికైనా వెళ్లే హక్కు, పనిచేసుకునే హక్కు ఆడపిల్లలకు ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన నిర్భయ ఉదంతం, తాజాగా ఈ ఉదంతంలో నిందితుడు ఇచ్చిన ఇంటర్వూ సంచలనానికి తెర తీశాయి. ఈ ఇంటర్వూ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  interview  bbc  homeministry  mukhesh  teharjail  

Other Articles