Shiv sena tells asaduddin owaisi to pursue his demands in pakistan

Shiv Sena advises Asaduddin Owaisi, Owaisi should pursue his demands in Pakistan, Owaisi should go to Pakistan and try his antics, Owaisi demands reservation for Muslims in Maharashtra, shiv sena reacted strongly to Owaisi, AIMIM chief Asaduddin Owaisi, shiv sena chief uddav Thackeray, reservation for Muslims, Shiv Sena, Asaduddin Owaisi, Muslim quota

Hitting out at AIMIM chief Asaduddin Owaisi for demanding reservation for Muslims in Maharashtra, Shiv Sena said that if the minority leader wants his demands to be met on religious grounds, then he should go to Pakistan and try his antics there.

అసుదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యాలపై శివసేన ఘాటు స్పందన..

Posted: 03/03/2015 03:26 PM IST
Shiv sena tells asaduddin owaisi to pursue his demands in pakistan

ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు కల్పించాలన్న ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యాలపై శివసేన ఘాటుగా స్పందించింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వుంటాయని, దీనికి ఎవరి సిఫార్సు అవసరం లేదన్న శివసేన..  మత ప్రాతిపదికన వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై మండిపడింది. గత ఆదివారం నాగ్‌పూర్‌ సభలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన శివసేన తన అధికార పత్రిక సామ్నాలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
ముస్లింలకు రిజర్వేషన్ కావాలంటే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రయత్నించుకోమంటూ  విరుచుకుపడింది. విద్వేషపూరిత  వ్యాఖ్యలు చేసిన ఒవైసీపై  ఫడ్నవీస్  ప్రభుత్వం కేసు నమోదు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో ప్రజల సామరస్యత మధ్య విధ్వేషాలు రెచ్చగోట్టడం సరికాదని సూచించింది. ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగేలా వ్యవహరించిన ఓవైసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారతదేశాన్ని తమ మాతృభూమిగా ముస్లిలందరూ  గౌరవించాలని కోరింది. మహారాష్ట్రలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్న ఒవైసీకి  తీవ్రవాదులు,  ముస్లిం తీవ్రవాదుల హింసాత్మక చర్యల వల్ల ఎంతమంది హిందువులు నష్టపోయారో తెలుసా  అని ప్రశ్నించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Asaduddin Owaisi  Muslim quota  

Other Articles