Kashmir valley receives snow fall

kashmir, snow fall, kashmir valley, beauty, nature,

The Kashmir Valley remained cut off from rest of the country for the second consecutive day today, due to continued rainfall in plains and snowfall in upper reaches.

మంచుదుప్పట్లో కాశ్మీర్ లోయ కొత్త అందాలు

Posted: 03/03/2015 03:29 PM IST
Kashmir valley receives snow fall

ఎప్పుడూ కాల్పులతో అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అరవిరిసిన అందాలతో మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. ఎప్పడు ఏం జరుగుతుందో అని గుండెల్ని చేతుల్లో పెట్టుకొని ఉండాల్సి వస్తుంది అక్కడ. ఇంత అందమైన లోకాన్ని చూశాక జీవితానికి ఇక చాలు అనుకునే వాళ్లు ఎంతో మంది. అయినా ఈ ఉపాద్ఘాతం అనుకుంటున్నారా..అక్కడికే వస్తున్నా..దేశంలోని ఏ ప్రాంతంలో దేవతలు కొలువై ఉంటారో. ఎక్కడ స్వర్గానికి దారులు తెరిచి ఉంటాయని చెప్పుకుంటారో అదే కాశ్మీర్ లోయ. నిన్నటి దాకా ఎన్నికల హడావిడితో వేడెక్కిన కాశ్మీర్ లోయ ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకొని కొత్త అందాలతో దర్శనమిస్తోంది.

kash01
kash02
kash03
kash04
kash05
kash06
kash07
kash08
kash09
kash10

ప్రకృతి అందాలకు నేలవాలం కాశ్మీర్ పచ్చని చెట్లు, మనస్సుకు ఆనందాన్ని నింపే ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం కావాల్సిందే. అందుకే మన కవులు కాశ్మీర్ అందాల గురించి ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది కాశ్మీర్. మామూలు సమయాల్లో అత్యద్భుతంగా కనిపించే కాశ్మీర్ లోయ అందాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. తీవ్ర హిమపాతంతో పాలపుంతలో ఉన్నట్లు కనినిస్తోంది కాశ్మీర్ లోయ. స్వర్గానికి మరో రూపంలా కనిపించే కాశ్మీర్ లోయ ఇప్పుడు మంచు గడ్డల అందాలతో నిండిపోయింది. అసలు అందమంటేనే కాశ్మీర్ లోయే..అక్కడ మామూలుగా అయినా అందాలకు కొదవలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న హితపాతంతో కొత్త ఖండంలా కనిపిస్తోంది. అరవిరిసిన అందాలతో చూడముచ్చటగా ఉంది.  అరవిరిసిన కాశ్మీర్ అందాలు మంచు తెరల్లోనూ ముచ్చగొల్పుతున్నాయి. చూసే కళ్లకు తెలుస్తుంది అందాల విలువ అన్నట్లు మనల్సి కొత్త లోకాల్లో విహరింపజేస్తుంది. మరి ఇలాంటి అందాలను అస్సలు వదులుకోవద్దని ఎవరైనా అనుకుంటే వెంటనే టిక్కెట్టేసుకొని కాశ్మీర్ లోయను బయలుదేరండి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kashmir  snow fall  kashmir valley  beauty  nature  

Other Articles