Stock market rally while budget speech

stock market rally while budget speech. stock market open with 250 points gain. but budget speech disappoint the stock holders. manily banking shares got gain.

stock market rally while budget speech

ప్రారంభంలో లాభాలతో.. తర్వాత నష్టాల్లోకి షేర్ మార్కెట్

Posted: 02/28/2015 01:17 PM IST
Stock market rally while budget speech

ఈ ఉదయం ప్రారంభం నుండి మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్నంత సమయం ఆటుపోట్లను ఎదుర్కొంది. మొత్తానికి స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే నడిచింది. మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విద్యుత్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మార్కెట్ ర్యాలీని కొనసాగించింది. సర్వీస్ ట్యాక్స్ ను 14 శాతానికి పెంచడం కోల్ పై సెస్ ను పెంచడం, సంపన్న వర్గాల నుండి 2 శాతం అదనపు సెస్ వసూలు, పన్నుల స్లాబ్ లను మార్చకపోవడం కొంత నిరాశకు గురిచేయగా, ఎక్సయిజ్, సర్వీస్ ట్యాక్స్ లను రిజిస్ట్రేషన్ కు అవకాశాన్ని పెంచడం, కార్పోరేట్ ట్యాక్స్ ను 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించడం, వ్యక్తిగత ట్యాక్స్ పెయర్స్ కు కొన్ని మినహాయింపులు ఇవ్వడం కీలక నిర్ణయాలు మార్కెట్ లను కొంత తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినా, ఫలితాలు మాత్రం  నెగిటివ్ గానే వచ్చాయి.

మొత్తానికి బడ్జెట్ ఊహించినంతగా రానించలేకపోయింది. బిఎస్ఇ సెన్సెక్స్ 29,229.71 వద్ద ప్రారంభమై ఓ దశలో 29,069.21 కు పడిపోయింది. గరిష్టంగా 29,550.71 కి చేరుకుంది.29,206.44 కు చేరుకొని 0.01 లాభాలను చేరుకుంది. నిఫ్టి 8833.40 వద్ద ప్రారంభమై, 8950.70ల గరిష్టానికి చేరి, 8809.94 కనిష్టానికి చేరింది. తర్వాత కాస్త పుంజుకొని 8861.90 కు చేరి 0.13శాతం లాభాలను స్వంతం చేసుకుంది. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహేంద్ర, హిందుస్తాన్ లిదర్ లిమిటెడ్, టాటా మోటర్స్ లాభాల బాటలో నడిచాయి. ఐటిసి లిమిటెడ్, ఎన్టీపీసి, ఎన్ఎమ్డిసి, భారత్ పెట్రోలియం, టాటా పవర్ లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇంకా స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stockmarket  budget  rally  nifty  bse  service tax  corporatetax  cess  taxslab  

Other Articles