Bride badly beaten by her new husband

bride badly beaten up, bride beaten on wedding night, bride badly beaten by her new husband, bride gives divorce to husband, bride divorces husband on the next day of marriage,

bride gives divorce to husband on the next day of marriage as he beats her up badly on the night of wedding day

పెళ్లైన మరుసటి రోజునే విడాకులు.. ఏంటీ కారణం..?

Posted: 02/17/2015 07:50 AM IST
Bride badly beaten by her new husband

పెళ్లి ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ మధురమైన రోజు. తమ జీవిత భాగస్వామితో పంచుకునే తొలి రోజు అనుభూతులు జీవితాంతం నిలిచేలా చేస్తాయి. ఆ మధుర సృతులను అప్పుడప్పుడూ గుర్తు చేసుకునేలా కొన్ని చిలిపి చేష్టలు, కోన్ని మొండి చేష్టలు వుంటాయి. ఇక ఆ రోజు రాత్రి అంటే.. ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఆ రోజు ప్రతి సెకను ఆస్వాదిస్తారు. కొత్త దంపతులు కోటి కలలతో అడుగులు వేస్తారు. ఒకరికొకరు దరిచేరలేనంత సిగ్గు.. అయితే వాటికి భిన్నంగా పెళ్లి రోజు రాత్రి వరుడి ఇంట్లోంచి పారిపోయిన ఓ వధువు అ మరుసటి రోజున వరుడికి ఓ విచిత్రమైన గిఫ్ట్ ఇచ్చింది. అదేంటనుకుంటున్నారా..?

అదే విడాకులు. పెళ్లి రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లిన వధువు మరుసటి రోజున వరుడికి విడాకులు పంపింది. ఇదేం పోయేకాలం.. ఒక్క రాత్రిలో అతగాడి గురించి ఆమెకు ఎం తెలిసింది.. ఎందుకలా విడాకులిచ్చిందో మీరే చదవండీ.. పెళ్లి రోజు రాత్రి అనుభూతలను పంచుకోవాల్సిన మధుర క్షణాలు గాలికొదిలేసి ఓ కొత్త పెళ్లికొడుకు తన భార్యను పెళ్లయిన రాత్రే చావుదెబ్బలు కొట్టాడు. ఎంతలా అంటే దెబ్బలు తిన్న ఆ అమ్మాయి పారిపోయి ఏకంగా విడాకుల నోటీసు కూడా పంపించింది. అయితే ఈ ఘటన దుర్హామ్లో చోటుచేసుకుంది.

అమీ డాసన్ (22 ) అనే యువతి,  గావిన్ గోలిట్లీ (29) అనే యువకుడిపై మనసుపడి పెళ్లి చేసుకుంది. తన వెడ్డింగ్ గౌను మార్చుకోడానికి ఇబ్బంది అవడంతో.. కాస్త సాయం  చేయమంది.. అంతే ఆ మాట విన్న అతడు ఇష్టం వచ్చినట్లు ఆమెపై పిడిగుద్దులు గుప్పించాడు. దాంతో ఆ అమ్మాయి బతుకు జీవుడా అంటూ అర్ధరాత్రి పారిపోయి అతగాడిని కోర్టుకు ఈడ్చింది. తనకు డ్రగ్స్ అలవాటు ఉందని, వాటి ప్రభావం వల్లే నియంత్రణ కోల్పోయి అలా ప్రవర్తించానని సదరు కొత్త పెళ్లికొడుకు కోర్టులో లబోదిబోమన్నా ఫలితం లేకపోయింది. రెండేళ్లపాటు సామాజిక సేవ చేయాల్సిందిగా కోర్టు అతడిని ఆదేశించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  badly beaten up  new husband  

Other Articles