Mumbai doctor makes golden contact lenses

mumbai doctor makes golden contact lenses, doctor makes golden contact lenses, contact lenses, golden lense, mumbai doctor chandra sekhar chowhan,

A doctor from mumbai makes goden comtact lenses, which attracts every one

తళ తళ మెరిసే మెరుపుల కళ్లు..

Posted: 02/17/2015 07:14 AM IST
Mumbai doctor makes golden contact lenses

నీ ఇల్లు బంగారం గాను, అంటూ ఓ సిని కవి ఏమంట పాట రాశాడో కానీ, అప్పటి తరంలో ఆ సాట తెలుగు ప్రేక్షకుల నోట ఇప్పటికీ నానుతుంది. అయితే పాటలాగే తన అరుదైన కళ్లు కూడా ఎప్పటికీ మగువలకు అతుకోవాలని భివిస్తున్నారు. ముంబయికి చెందిన డాక్డర్ చంద్రశేఖర్ చౌహన్. అదేంటనుకుంటున్నారా..? అవునండి అమ్మాయిలకు బంగారం అంటే ఎంత ఇష్టమో తెలుసుకున్న డాక్డర్ వారి కోసం అరుదైన కళ్లను కూడా తయారు చేశాడట. ఒంటి నిండా బంగారాన్ని పోందుపర్చుకునే మగువలకు ఇప్పుడు ఈ కొత్త కళ్లు మరింత అందాన్ని జోడిస్తున్నాయట. సాధారణంగా డబ్బున్న వారు పళ్లు విరిగిన సమయంలో వారి పళ్లను పసిడితో చేయించుకున్న ఘటనలను మనం చూశాం.

అమ్మాయిల అందమైన కళ్ల గురించి వాలు కళ్లని, నయనాలను పోగిగిన కవులు.. 'తళ తళ మెరిసే మెరుపుల రాణి అంటూ కీర్తించాల్సిన అవసరం వచ్చేస్తోంది. ముంబాయి వైద్యులు అచ్చమైన బంగారంతోనే కాంటాక్టు లెన్సులు తయారు చేసి అమ్మాయిల కళ్లకు కొత్త తళుకులు తీసుకొస్తున్నారు. ముచ్చట పడిన ముద్దు గుమ్మలు ఈ బంగారు లెన్సులు ధరించాలంటే రూ. 9.30 లక్షల నుంచి రూ. 11.16 లక్షల వరకు చెల్లించాలండోయ్! 24 కారెట్ల బంగారంతో తాను తయారు చేస్తున్న ఈ కాంటాక్టు లెన్సులకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోందని డాక్టర్ చంద్రశేఖర్ చౌహాన్ తెలిపారు.

తాను తయారు చేస్తున్న బంగారు కంటి లెన్సులను చూసి కొంత మంది వాటిని ధరించేందుకు భయపడుతుండగా ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. కంటికి బంగారం అతుక్కుపోకుండా రెంటికి మధ్య తాను మరో పొరను ఏర్పాటు చేసే జాగ్రత్త తీసుకున్నానని చెప్పారు. తాను కొత్తగా వజ్రాలతో కూడా కాంటాక్ట్ లెన్సులను తయారు చేశానని, తనవద్దకొచ్చే అమ్మాయిలకు బంగారం లేదా వజ్రాల లెన్సులను ఎంచుకునే అవశాం కూడా ఉందంటున్నారు. వీటిని తాను అమెరికాలో కూడా విక్రయించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదు. ఈ లెన్స్‌ల వల్ల కంటి దృష్టికి ఎలాంటి హాని ఉండదని ముందుగా రుజువు కావాలని, ఆ తర్వాత అమెరికా ఫుడ్స్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ నుంచి అనుమతి పొందాలని నిపుణులు చెబుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : contact lense  golden lense  mumbai doctor chandra sekhar chowhan  

Other Articles