Crude oil transport rail blast in vergenia of america

crude oil nlast, vergenia, konava river

crude oil transport rail blast in vergenia of america : crude oil transporting rail got fire in near verginia. 30 boxes of train fall into konava river. no body injured in this incident.

వర్జీనియాలో భారీ పేలుడు...నదిలోకి ముడి చమురు

Posted: 02/17/2015 09:45 AM IST
Crude oil transport rail blast in vergenia of america

అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పడంతో పశ్చిమ వర్జీనియాలో ఈ పేలుడు జరిగింది. రైలులోని  30 పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో కనావా, ఫెయెటీ కౌంటీల్లో అత్యవసరస్థితి ప్రకటించారు. సంఘటనా స్థలానికి ఒక కిలోమీటరకు దూరం వరకు ఉన్న నివాసితులు ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. ప్రమాదానికి కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. రైలులోని ముడి చమురు కనావా నదిలో కలిసింది. కనావా, ఫెయెటీ కౌంటీ వాసులకు మంచినీరు అందించే ఈ నదిలో చమురు కలవడంతో తాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. దీంతో మంచినీటిని నిల్వచేసుకోవాలని పశ్చిమ వర్జీనియా గవర్నర్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crude oil nlast  vergenia  konava river  

Other Articles