Tv serial actress deepthi alias ramalakshmi suicide hyderabad city

deepthi alias ramalakshmi, tv actress deepthi suicide, tv actress ramalakshmi suicide, ramalakshmi suicide, deepthi suicide case, deepthi hang

tv serial actress deepthi alias ramalakshmi suicide hyderabad city : tv serial actress deepthi alias ramalakshmi suicide herself on saturday in hyderabad city.

టీవీ నటి దీప్తి ఆత్మహత్య వెనుక కారణం..?

Posted: 02/14/2015 03:43 PM IST
Tv serial actress deepthi alias ramalakshmi suicide hyderabad city

హైదరాబాద్ నగరంలో బుల్లితెరకు చెందిన ఓ నటి ఆత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి అలియాస్ రామలక్ష్మీ కెరీర్ అంతా సాఫీగానే కొనసాగుతుండేది. ఇండస్ట్రీలో వున్న వారందరితోనూ కలివిడిగానే వుండేది. రెగ్యులర్ షూటింగులలో కూడా పాల్గొనేది. షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనూ ఆమె అందరితోనూ ఫ్రెండ్లీగానే వ్యవహరించేది. కానీ.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదుగానీ.. తానుంటున్న నివాసంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ నగరం బాలానగర్ సమీపంలోని ఫతేనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో దీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం! ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మరణానికి గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. కాగా.. ఈమె మరణంపై పలువురు బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv actress deepthi suicide  telugu tv serial actresses  

Other Articles