Tirupathi by polls records low polling percentage

Tirupathi by polls records low polling percentage, tirupathi by election, telugu desham party, TDP, Tdp candidate, congress party, congress candidate, sridevi congress candidate, tirupathi by poll candidate sridevi, polling paercentage,

tirupathi by election records very low polling percentage of 51 percent

తిరుపతి ఉప ఎన్నికలలో తక్కువ పోలింగ్ శాతం..

Posted: 02/13/2015 09:30 PM IST
Tirupathi by polls records low polling percentage

తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ లో కేవలం 51 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఉప ఎన్నికపై ప్రజలలో ఆసక్తి లేకపోవడంతోనే ఇంత తక్కువగా పోలింగ్ శాతం నమోదంది. కాగా ఉప ఎన్నిక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం మందకొడిగా పోలింగ్‌ జరిగిన మధ్యాహ్నానికి పుంజుకుంది. సాయంత్రం 6 గంటలు ముగిసే సయయానికి 51 శాతం పోలింగ్‌ జరిగినట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అధికారికంగా వెలువడవలసి ఉంది.

అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీదేవి పోలింగ్‌ బూత్‌ల వద్ద హల్‌ చల్‌ చేశారు. కొంతమంది టీడీపీకి దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ అధికారులు, పోలీసులపై మండిపడ్డారు. అధికార పార్టీకి అమ్ముడుపోయారంటూ అధికారులను దూషించారు. పదిహేను పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన శ్రీదేవి ప్రతీ చోటా ఎన్నికల సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మిన్నకుండిపోయారు. ఓటమి భయంతోనే శ్రీదేవి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని టీడీపీ వర్గాలు విమర్శించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirupathi  by election  polling  

Other Articles