Arvind kejriwal s janlokpal bill ignored even if passed by delhi assembly

Janlokpal Bill, Arvind Kejriwal, Aam Aadmi Party, Delhi Police, DDA, Lokpal and Lokayukta Act and NCT Act 1991, Ministry of Home Affairs, Arvind Kejriwal's jan lokpal, Delhi Assembly, union ministry, parliament, full statehood to delhi, delhi wants powers to probe officials, aap jan lokpal bill,

The fate of Arvind Kejriwal's showpiece legislation, Janlokpal Bill, is tied to the acceptance of his full statehood demand as he wants powers to probe officials of the Delhi Police as well as Delhi's various municipal corporations, according to the Union Home Ministry.

ఢిల్లీకి పూర్తిస్థాయి అధికారం వస్తేనే.. జన్ లోక్పాల్ కు మోక్షం..

Posted: 02/13/2015 07:57 PM IST
Arvind kejriwal s janlokpal bill ignored even if passed by delhi assembly

అప్ అధ్యక్షుడు, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మానస పుత్రికకు మోక్షం లభిస్తుందా..? ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలలో మూడు స్థానాలు మినహా 67 స్థానాలను కైవసం చేసుకుని 96 శాతం బలం వున్న అప్ మానస పుత్రిక ఆదరణకు నోచుకుంటుందా..? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతానికి లభించడం లేదు. ఇంతకీ అరవింద్ కేజ్రీవాల్ మాసన పుత్రిక అని దేనిని అభివర్ణిస్తున్నారు..? అనేగా మీ సందేహం. అదే జన్ లోక్ పాల్ బిల్లు.

గత ఏడాది సరిగ్గా ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అన్ని రాజకీయ పార్టీలను, పార్టీల ప్రముఖులను ఖంగుతినింపించారు. అయితే ఆయన రాజీనామాకు దారి తీసిన అంశం మాత్రం జన్ లోక్ పాల్ బిల్లు. దానిని అమోదించాలని ఆయన అప్పటి మద్దతు నిస్తున్న పార్టీ కాంగ్రెస్ ను కోరినా.. వారు మద్దతు ప్రకటించలేదు. ఈ తరుణంలో జన్ లోక్ పాల్ బిల్లుకు మద్దతినివ్వని పక్షంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించినా అప్పటి మద్దతుదారులు వినిపించుకోలేదు, దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇప్పుడున్న సభా బలంతో జన్ లోక్ పాల్ బిల్లుకు అమోదం లభిస్తుందా అన్న ప్రశ్న తెరపైకి వస్తుంది.

సభలో పూర్తి మెజారిటీ వుండటంతో ఢిల్లీ అసెంబ్లీలో అమోదం లభించినా.. కేంద్రంలో జన్ లోక్ పాల్ బిల్లు అటెకెక్కనుందని సమాచారం. జన్ లోక్ పాల్ భిల్లను అమోదించడంలో కేంద్రం మూడు అంశాలలో అభ్యంతరాలను తెలపనున్నట్లు కేంద్ర హోం శాఖ సీనియర్ అధికారి తెలిపారు. అవినీతికి పాల్పడిన పోలీసుల, ఢిల్లీ మున్సిఫల్ అధికారులు, ఇతర అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వారంతా కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించినప్పుడే అరవింద్ కేజ్రీవాల్ మానసపుత్రిక జన్ లోక్ పాల్ బిల్లుకు మోక్షం లభిస్తుందని అధికారి వెల్లడించారు. మరి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఎలా వత్తిడి తీసుకువస్తారో వేచి చూడాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janlokpal Bill  Arvind Kejriwal  Aam Aadmi Party  

Other Articles