Jackie chan s son jaycee chan released from prison

Jackie Chan's son released from prison, jaycee chan released from prison, chinese actor released from prison, jaycee chan released from prison, Jackie Chan’s son Jaycee Chan, Chinese movie star Jackie Chan, Jaycee Chan tested positive for marijuana, jaycee chan arrested in drug case, Beijing police arrested Jaycee chan, jaycee chan released after six-month jail,

Chinese movie star Jackie Chan’s son Jaycee Chan was Friday released after serving a six-month jail term. On Aug 14, 2014, Beijing police arrested Jaycee and Taiwanese actor Ko Chen-tung, both tested positive for marijuana and admitted to have used the drug, Xinhua reported.

జైలు నుంచి విడుదలైన జాకీ చాన్ తనయుడు..

Posted: 02/13/2015 09:32 PM IST
Jackie chan s son jaycee chan released from prison

హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ తనయుడు, చైనా చిత్రసీమ హీరో జైసీ చాన్ జైలు నుంచి విడుదలయ్యారు. సుమారుగా ఆరు మాసాల తరువాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్ వాడిన కేసులో అడ్డంగా దోరికిన హీరో జైసీ చాన్ కు చైనాలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఇవాళ్టికి శిక్షను సూర్తి చేసుకున్న జైసీ చాన్ విడుదలయ్యారు. కోర్టు విధించిన 326 డాలర్ల జరిమానా కూడా కోర్టులో తన కుటుంబసభ్యులు చెల్లించడంతో న్యాయస్థానం ఆయనను విడుదల చేసింది.

తన స్నేమితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి డ్రగ్స్ సేవిస్తూ గతేడాది ఆగస్టులో జాయ్ సీ చాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణ అనంతరం అతనికి బీజింగ్ పోలీసులు డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టులో ప్రవేశపెట్టాడు. న్యాయస్థానం ఆరు నెలల శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా తన జైలు శిక్షకు తన తండ్రే కారణమని జైసీ చాన్ గతంలో ఆరోపించారు. తన తండ్రి నిత్యం షూటింగ్ ల బిజీగా వుండటంతో ఇంటిపట్టున ఒంటరిగా వుంటున్న తనకు ఏమి చేయాలో తోచక తాను డ్రగ్స్ అలవాటు పడ్డానని జైసీ చెప్పాడు. కాగా తన కుమారుడు జైలు నుంచి విడుదల కావడంపై జాకీ చాన్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్న రాక్షసుడిని స్వేచ్ఛగా చూడటం సంతోషంగా వుందని వ్యాఖ్యానించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackie Chan  Jaycee Chan  released from prison  

Other Articles