President robert mugabes guards sacked for allowing him to trip on red carpet

president robert mugabe trip on red carpet, president guards sacked for allowing him to trip, president robert mugabe, president security guards, zimbabwe president robert mugabe, how did president triped, what were president robert mugabe security doing,

Nearly 30 bodyguards to Robert Mugabe have reportedly lost their jobs after "allowing" him to fall over on a red carpet in public.

కిందపడిన దేశాధ్యక్షుడు.. 27 మంది సెక్యూరిటీ సిబ్బందిపై వేటు..

Posted: 02/12/2015 08:56 PM IST
President robert mugabes guards sacked for allowing him to trip on red carpet

రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్న చందంగా దేశాద్యక్షుడి ఆగ్రహానికి కారణమైన వారిపై వేటు పడింది. దేశాధ్యక్షుడిని ఆపద సమయాల్లో కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఆయన పడిపోతున్నా.. వేడుకను చూస్తున్నట్లు నిశ్చేష్టులుగా నిల్చోడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అందులోనూ ఒకరిద్దరు కాదు సుమారుగా మూడు పదుల సంఖ్యలో వున్న భద్రతా సిబ్బంది ఆయనను కిందపడకుండా కాపాడటంలో విఫలమయ్యారు. ఇంతకీ ఎవరా దేశాధ్యక్షుడు.. ఎక్కడ జరిగిందీ ఘటన, అంత నిర్లక్ష్యపు భద్రతా సిబ్బంది ఎవరనేగా మీ సందేహాలు..

వివరాల్లోకి వెళ్తే.. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ముగాబేకు హరారే విమానాశ్రయంలో రెడ్‌కార్పెట్‌తో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. పక్కనే వున్న వేదికపై నుంచి ప్రసంగించిన అనంతరం ఆయన కాన్వాయ్‌ వైపుకి వచ్చేందుకు వేదికపై నుంచి కిందకు వచ్చేందుకు మెట్లు దిగారు. అయితే వయసు మీద పడటంతో అడుగు తడబడింది. దాంతో ఆయన కింద పడ్డారు. అయనతో పాటు కదిలిన ఆయన భద్రతా సిబ్బంది మాత్రం ఆయనను కిందపడబోనీయకుండా ఆపడంలో విఫలమయ్యారు.

ఆ తరువాత నింపాదిగా తేరుకుని అధ్యక్షుడు రాబర్ట్‌ముగాబేను పైకి లేపారు. ఈ ఘటనతో రాబర్ట్ ముగాబే కోపం తారాస్ధాయికి చేరింది. తను పడిపోతుంటే పట్టుకుకోకుండా చూస్తూ నిశ్చేష్టులుగా వున్న బధ్రతా సిబ్బందిపై వేటు వేశారు. వారిలో ఒక్కరిని కూడా ఉపేక్షించకుండా విధుల్లో వున్న మొత్తం 27మంది రక్షణ సిబ్బందిపై వేటు వేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సుదీర్ఘకాలంగా జింబాబ్వేను పాలిస్తున్న ముగాబే ప్రస్తుత వయస్సు 90 సంవత్సరాలు.  మరో రెండు నెలలు అగితే.. సరిగ్గా ఏప్రిల్ 21 నాటికి ఆయన 91 ఒడిలో అడుగుపెడతారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zimbabwe  president  robert mugabe  securuty sacked  

Other Articles