Sachins adopted village development works on snail s pace

sachin tendulkars adopted village, tendulkars adopted village lies utter neglect, sachin tendulkar, nellore, Puttamrajuvari Kandriga village, cricket legend sachin tendulkar, Rajya Sabha member Sachin Tendulkar, Union government’s Model village scheme, pr kandriga development works on snail’s pace,

Contrary to the expectations of residents of Puttamrajuvari Kandriga village, which was adopted by cricket legend and Rajya Sabha member Sachin Tendulkar under the Union government’s Model village scheme, development works have been moving at a snail’s pace

సచిన్ పీఆర్ కండ్రిగలో నత్తనడకన అభివృద్ధి..

Posted: 02/12/2015 08:54 PM IST
Sachins adopted village development works on snail s pace

ప్రముఖ క్రికెట దిగ్జజం, రాజ్యసభ సభ్యుడు భారత రత్న సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పుట్టమరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ .. ఆ  గ్రామంలో అభివృద్ధి పనులను నిర్లక్ష్యం అవహించింది. వాటర్ పైప్‌లైన్లకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రెయిన్స్, రోడ్లు, ఇళ్ల పథకం వంటివాటిలో ఏ మాత్రం ప్రగతి కనిపించడం లేదని మీడియాలో కథనాలు వచ్చాయి. గ్రామంలోని పారిశుధ్య పరిస్థితి పట్ల కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో పుట్టమరాజు కండ్రిగకు అప్పటి కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ రూ.3.05 కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత తన ఎంపి లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ నిధుల నుంచి సచిన్ టెండూల్కర్ రూ.2.79 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అయితే, అభివృద్ది పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయితే, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖ సెలబ్రిటీ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామంలో అభివృద్ది శరవేగంగా జరుగుతుందని అధికారులు ఆశించారు. అదే విషయాన్ని అధికారులు ప్రజలకు చెప్పారు. రాత్రికి రాత్రే గ్రామం మారిపోతుందనే ఊహలకు ప్రాణం పోశారు.

ఈ అతి ప్రచారం కూడా గ్రామ ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం ఈ గ్రామసమస్య. కాగా, పుట్టమరాజు కండ్రిగలో పనులు నడుస్తున్న తీరును జిల్లా కలెక్టర్ ఎం జానకి సంబంధిత అధికారులతో బుధవారంనాడు సమీక్షించారు. గ్రామంలో పనులను వేగంగా నడిపించే బాధ్యతను జాయింట్ కలెక్టర్ ఎండి ఇంతియాజ్‌కు అప్పగించినట్లు సమాచారం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  nellore  puttamraju kandriga  

Other Articles