Cm kcr hyderabad city telangana large meeting

cm kcr, telangana large meeting, cm kcr large meeting, telanangana cm news, harish rao news, ktr news, hyderabad city errors, hyderabad city news, hyderabad government, kcr controversial comments, kcr press meet, kcr meeting

cm kcr hyderabad city telangana large meeting : cm kcr talks about hyderabad city errors which had done by past governments. He said that their government will rescue all empty places and give those to poor peole.

‘‘హైదరాబాద్ నగరం... ఇదొక పిచ్చోళ్ల సిటీ’’!

Posted: 02/04/2015 12:30 PM IST
Cm kcr hyderabad city telangana large meeting

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సిటీని ప్రపంచంలోకెల్లా గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని గతంలో ఎన్నోసార్లు వ్యాఖ్యానించిన సంగతి విదితమే! ఇటీవలే కూడా ఆయన ఈ సిటీని డల్లాస్ నగరం కంటే ఘనంగా (గ్లోబల్ సిటీ)గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధి కోసం పావులు కదిపిన ఆయన.. సిటీలో వున్న లోపాలను విశ్లేషించారు. హైదరాబాద్ చెప్పుకోవడానికే తప్ప చూడదగ్గ గొప్ప నగరమైతే కాదన్న అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. హైదరాబాద్’ను మెరుగైన నగరంగా తీర్చిదిద్డడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం పొందాయని పేర్కొన్న ఆయన.. ఆ సందర్భంగా తనదైన విమర్శలు గుప్పించారు.

‘‘హైదరాబాద్ నగరాన్ని నేను కట్టించానని ఒకడంటాడు.. ఇంకొకడు నేను హైటెక్ సిటీ కట్టించానని అంటాడు.. ఇంకోడు ఏదో అంటాడు.. కానీ ఈ నగర స్థితిగతులను చూస్తే.. పిచ్చోళ్ల సిటీ కూడా వుండదు. ఏ గవర్నమెంటో, మున్సిపాలిటీయో దీన్ని నడపడం లేదు.. ఏదో ధర్మం మీద నడుస్తోంది అంతే!’’ అని ఆయన అన్నారు. అలాగే నగరంలోని లోపాలను విశ్లేషిస్తూ.. ‘‘చచ్చిపోతే కాల్చేందుకు శ్మశానవాటిక లేదు.. బొంద పెట్టేందుకు బరియల్ గ్రౌండ్ లేదు. ఒక్క వానొస్తే చాలు సీఎం ఉండే బేగంపేట వద్ద నడుముల్లోతు నీళ్లు.. గవర్నర్  ఉండే రాజ్‌భవన్ వద్ద మోకాల్లోతు నీళ్లు.. అసెంబ్లీ ముందు నడుముల్లోతు నీళ్లు.. ఒక్కటంటే ఒక్కటి సరిగ్గా లేదు. గతంలో నన్నొకాయన అడిగాడు.. మీ నగరమెందుకు అంత ఘోరంగా వుందని! అప్పుడు నేను ఆయనతో చెప్పిన.. మాది హైటెక్ సిటీ అని.. వానాకాలంలో మా కార్లు పడవలు అయితయని’’ అంటూ హైదరాబాద్ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు.

కొంపల్లిలో మంగళవారం జరిగిన విస్త్రతపార్టీ సమావేశంలో ఆయన పై విధంగా హైదరాబాద్ గురించి ప్రస్తావించారు. రాజధానిలో అనువైన సౌకర్యాలు లేవని పేర్కొన్న ఆయన.. నగరంలో మార్పు తెచ్చేందుకు ఎవరూ ఊహించని విధంగా ‘గ్లోబల్ సిటీ’గా అభివృద్ధి చేస్తామన్నారు. ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలన్నీ వెదికి.. అందులో ప్రజలకు అనువైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. 2.80 లక్షలమంది పేదలకు 150 గజాలమేర భూములను ఉచితంగా పంచిపెడ్తామన్న ఆయన.. ఈ నెల 20వ తేదీ నుంచి పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఖాళీగా వున్న భూముల్లో కూరగాలయ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr latest updates  hyderabad city news  harish rao news  

Other Articles