Angelina jolie more admired women

Angeline Jolie news, Angelina Jolie admired woman, Hillary Clinton news, Michelle Obama news, bill gates news, Angelina Jolie hot photos, Angelina Jolie hot gallery, Angelina Jolie photo shoot, Angelina Jolie affairs, bill gates life story, Hillary Clinton photos, Angelina Jolie survey, admired woman in the world, malala yousafzai, bill gates, aung sang Suki, Angela Merkel, Hillary Clinton, Queen Elizabeth, Michelle Obama, Oprah win fray, julia roberts, you vogues

Angelina Jolie is more admired around the world than Hillary Clinton or Michelle Obama, according to a new survey.

నిత్య నూతన అందం.. తరగని అభిమానం.. ఏంజెలీనా సొంతం..

Posted: 02/03/2015 04:41 PM IST
Angelina jolie more admired women

హాలీవుడ్ నటి, ఫిల్మ్ మేకర్ ఏంజెలీనా జోలీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. టైటానిక్ సినిమాతో హాలీవుడ్ వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగు పదుల వయసులోనూ తన నిత్యనూతన అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కట్టిపడేస్తూ.. ప్రపంచ అభిమాన మహిళగా నిలిచింది. హాలివుడ్ చిత్రసీమలోకి బాలనటిగా అడుగుపెట్టి.. హాకర్స్ అనే చిత్రంతో బ్రేక్ సంపాదించి ఇరవై వసంతాలు కావస్తున్నా.. ఏంజెలీనా పట్ల ప్రపంచవ్యాప్తంగా తరగని ఆదరణ కనిపిస్తోంది. తాజాగా ఈమె ప్రపంచ ఆరాధ్య మహిళగా నిలిచింది. వెబ్ ఆధారితంగా జరిగిన ఒక పోల్ లో అనేక మంది మహిళామణుల మధ్య ఏంజెలీనాను ఆరాధ్యమైన మహిళగా నిలిపారు అభిమానులు.  

23 దేశాలకు చెందిన దాదాపు పాతికవేల మంది నెటిజన్లు పాల్గొన్న యువ్గోవ్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఏంజలినా టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని పొందిన యూసూఫ్ మలాలా సహా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ , కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులందరి కన్నా ఈ పోల్ లో ఏంజెలీనా కే ఎక్కువ ఆదరణ కనిపించింది.

ఏంజెలినా జోలికి అగ్రస్థానంలో నిలువగా, నోబుల్  శాంతిపురస్కార గ్రహీత మలాలా రెండో స్థానలో నిలచింది. హిల్లరీ క్లింటన్, క్వీన్ ఎలిజబెత్ , మిషెల్ ఒబామాలు క్రమంగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అమెరికా టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రే, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, రాజకీయ వేత్త అంగ్ సన్ సూకీ లు కూడా టాప్ 10 లో నిలిచారు. పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelina Jolie  Admired Woman  Bill gates  

Other Articles

Today on Telugu Wishesh