Player dies at national games

sports, national games, thiruvananthapuram, kerala, maharashtra, player, Australia cricketer Philip hughes, philip hughes, phil huges, Mayuresh Pawar, net ball player Mayuresh Pawar, maharastra netball player Mayuresh Pawar, Mayuresh Pawar dies of cardiac arrest, Vellayani near thiruvananthapuram, mayuresh pawar collapses after the match, Maharashtra and Chandigarh match

Tragedy struck the ongoing National Games as a 21-year-old netball player from Maharashtra died following cardiac arrest.

స్టేడియంలో కుప్పకూలి క్రీడాకారుడి మృతి

Posted: 02/02/2015 06:37 PM IST
Player dies at national games

బౌన్సర్ బంతిని ఎదుర్కోవడంలో విఫలమై ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ గ్రౌండ్ లోనే కుప్పకూలి మరణించిన ఘటన మధుర స్మృతుల నుంచి తొలగిపోక ముందే.. మరో భారత క్రీడాకారుడు ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్ అడిన మరుక్షణంలోనే గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. దీంతో కేరళలోని తిరువనంతపురం జరుగుతున్న జాతీయ క్రీడల్లో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 21ఏళ్ల నెట్ బాల్ ఆటగాడు గుండెపోటుతో మృతి చెందాడు. శిక్షణ పొందుతున్న సమయంలోనే మయురిష్ పవార్ అనే క్రీడాకారుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని జాతీయ క్రీడల సెక్రటేరియట్ అధికారులు చెప్పారు.

‘వెల్లయానిలోని ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం అతని గదికి వెళుతుండగా ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతనితోపాటు ఉన్న ఇతర సభ్యులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు' అని అధికారులు తెలిపారు. అతని మృతదేహాన్ని అతని టీంకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : national games  thiruvananthapuram  net ball player dies  Mayuresh Pawar  

Other Articles