Court notices to kejriwal

delhi assembly elections 2015, delhi high court, court issues notices to kejriwal, court notices to kejriwal, arvind kejriwal, delhi congress candidate kiran walia, Kiran walia, AAP, bjp, amit shah, prime minister, narendra modi, ajay maken, delhi cm candidates, kiran bedi

Delhi high court issues notices to aap national secretary Aravind kejriwal

అరవిందుడు న్యాయానికి బదులివ్వాల్సిందే..

Posted: 02/02/2015 02:32 PM IST
Court notices to kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఢిల్లీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నివసించే కేజ్రీవాల్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారంటూ ఆయనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు కిరణ్ వాలియా చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నోటీసు ఇచ్చింది. కేజ్రీవాల్, ఇతరులు దీనికి సమాధానం ఇవ్వాలంటూ కేసు విచారణను జస్టిస్ విభు బఖ్రు ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు.

కాగా కోర్టు ఆవరణలో న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తన చిరునామాను తప్పుగా పేర్కొన్నారని ఆరోపించారు. ఢిల్లీ ఓటరుగా ఉండేందుకే ఆయనిలా చేశారని ఆరోపిస్తూ.. అందువల్ల న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. ఢిల్లీలోని బీకే దత్ కాలనీలో తాను శాశ్వత నివాసినంటూ ఎన్నికల కమిషన్కు కూడా కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆమె ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi assembly elections 2015  arvind kejriwal  kiran walia  

Other Articles