Will approach court if not asks apology

aap seeks apology, aap gives two hour deadline to bjp, bjp controversial advertisement, delhi assembly elections 2015, delhi high court, republic day celebrations, court issues notices to kejriwal, court notices to kejriwal, arvind kejriwal, delhi congress candidate kiran walia, Kiran walia, AAP, bjp, amit shah, prime minister, narendra modi, ajay maken, delhi cm candidates, kiran bedi,

Aam Aadmi Party has issued a two-hour deadline to Bharatiya Janata Party over its controversial advertisement in newspapers.

క్షమాపణలు చెబుతారా..? కోర్టుకెళ్లమంటారా..?

Posted: 02/02/2015 06:40 PM IST
Will approach court if not asks apology

అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ బీజేపీపై సమరానికి సిద్దమవుతున్నారు. అయితే నిజంగా కత్తి, డోలు చేతబట్టి కాదండి. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి బీజేపిని ఇరుకున పెట్టేందుకు రెడీ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రకటనల రూపంలో బీజేపీ దాడి కొనసాగిస్తున్న క్రమంలో ఆయన ఈ చర్యలకు పూనుకునేందుక సిద్దమవుతున్నారు. దినపత్రికలలో వివాదాస్పద కార్టూన్లు రూపంలో ప్రకటనలు వేసి తనపై వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించడం పట్ల కేజ్రీవాల్ మండిపడుతున్నారు. తనపై చేస్తున్న విషప్రచారంపై రెండు గంటల్లో క్షమాపణ చెప్పాలని ఆయన బీజేపిని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి బీజేపిపై న్యాయపోరాటానికి వెనకాడబోనని చెప్పారు. వారి పార్టీ గురించి వారు ప్రకటనలు చేయడం మంచిది, కానీ ప్రత్యర్థి పార్టీలపై బురద జల్లే విధంగా పార్టీలు ప్రకటనలు ఇవ్వడం బాధాకరమన్నారు. ఈ విషయంలో ఎలక్షన్ కమీషన్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.

బీజేపి అధిష్టానం తొలి ప్రకటనలో అన్నా హాజారే, కాంగ్రెస్‌తో లింక్ చేసి విమర్శించగా, తాజాగా మరో ప్రకటనలో కేజ్రీవాల్‌ను వ్యంగంగా చిత్రీకరించింది. గత ఏడాది జనవరిలో రాజీనామా చేసి ఆ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకులకు అంతరాయం కలిగిస్తానని హెచ్చరించిన వ్యక్తి, ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకులకు తనన్ని ఆహ్వానించకపోవడంతో వీఐపీ పాస్ అడగటాన్ని అందులో పేర్కొంది. మరో ప్రకటనలో కేజ్రీవాల్ 'ఉపద్రవి-గోత్రా' అంటు తన కులంపై కూడా విమర్శలు చేసింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో ఓటమి భయంతోనే బీజేపి చౌవకబారు ప్రకటనలు చేస్తుందని ఆప్ నేతలు విమర్శించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi assembly elections 2015  arvind kejriwal  BJP  controversial advertisement  

Other Articles