Foundation stone laid for iim visakhapatnam

Foundation stone laid for IIM-V, Union HRD Minister Smriti Irani, Smriti Irani, IIM-Visakhapatnam, Gambheeram village, Union Minister of Urban Development, Venkaiah Naidu, AP Chief Minister, Chadrababu, IIM-Visakhapatnam foundation stone, IIT-V

Union HRD Minister Smriti Irani laid the foundation stone for IIM-Visakhapatnam at Gambheeram village in the presence of Union Minister of Urban Development M Venkaiah Naidu, Chief Minister N Chandrababu.

ITEMVIDEOS: కోత్త ఆశలు.. సరికొత్త ఆంధ్రా ప్రతిభావంతులు..

Posted: 01/17/2015 08:11 PM IST
Foundation stone laid for iim visakhapatnam

కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో విశాఖ ఐఐఎంను ప్రారంభించుకుంటున్నామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఐఐఎం నుంచి సరికొత్త ప్రతిభావంతులు తయారవ్వాలని ఆమె ఆకాంక్షించారు. విశాఖజిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎంకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ... గత బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన విధంగా ఐఐఎంను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఐఐఎం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. యువత కలలు సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకె ళ్తున్నట్లు చెప్పారు. సుందరమైన విశాఖ నగరానికి హుద్‌హుద్ తుపాను నష్టం తెచ్చిందన్నారు. విశాఖ ఐఐఎంకు బెంగళూరులోని ఐఐఎం సిబ్బంది సహకారమందిస్తారని వెల్లడించారు. దేశంలో అందరూ విద్యను అభ్యసించేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఐఎం కేటాయించడం అందరికీ గర్వకారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన ఖనిగా మారబోతోందన్నారు. మన తెలివితేటలతో యువతకు నైపుణ్యాన్ని అందిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. తెలుగు యువత రూ.కోటి వరకు వేతనం తీసుకుంటున్నారు... ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ విద్యాసంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని ప్రకటించారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. చంద్రబాబుకు పరిపాలన అనుభవం, దార్శనికత ఉందని, ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే తపిస్తుంటారన్నారు.

విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా తయారవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉన్నత విద్యలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మన దగ్గర చదువుకున్న ఐటీ ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని వెల్లడించారు. విశాఖలో ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని కుమార మంగళం బిర్లాను కోరగా... ఆయన సముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  foundation stone  IIM-Visakhapatnam  Venkaiah Naidu  Chadrababu  

Other Articles