Balakrishna welcomed with empty pots in anantapuram

Actor turned politician balakrishna, welcomed with empty pots, Hindupuram assembly constituency, anantapuram, hindhupuram, nandamuri balakrishna, water problems, NTR sujala sravanthi scheme, Andhrapradesh,

Actor turned politician balakrishna welcomed with empty pots in his Hindupuram assembly constituency of anantapuram district

అయ్యో..! పాపం బాలయ్య..!! ఖాళీ బిందెలు ఏంటయ్యా..!!!

Posted: 01/17/2015 08:09 PM IST
Balakrishna welcomed with empty pots in anantapuram

సినిమా నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గ పర్యటనలో తొలిరోజే చుక్కెదురైంది. సినిమాల్లో ఎందరెందరో విలన్లను ఒంటి చేత్తో మట్టుబెట్టగల హీరోకు.. నిజ జీవితంలో అందులోనూ రాజకీయ నేతగా, ప్రజా ప్రతినిధిగా తొలిసారి పరాభవం ఎదురైంది. ఇన్నాళ్లు ప్రజలను ఒక వైపే చూసిన బాలకృష్ణకు.. ప్రజలు మరో వైపును శాంపిల్ గా చూపించారు. అదేంటనుకుంటున్నారా..?

అనంతపురం లోని హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలయ్యకు స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంటలో గత మూడు నెలలుగా తాగునీరు రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు మరిచారంటూ బాలకృష్ణని మహిళలు ఈ సందర్భంగా నిలదీశారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కన్నా ముందుగా తన హిందూపురం నియోజకవర్గంలో ఎన్టీయార్ సుజల స్రవంతి పథకం ద్వారా అన్ని గ్రామాలకు నీరందిస్తానని బాలయ్య ఎన్నికల సమయంలోనూ, గెలిచిన తరువాత కూడా నియోజకవర్గ పర్యటనలో పలుమార్లు చెప్పారు. అయితే మూడు నెలలుగా నీరు రాకపోవడంతో మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో బాలయ్యకు చుక్కెదురైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగి, మహిళలను శాంతపరిచారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anantapuram  hindhupuram  nandamuri balakrishna  water problems  

Other Articles