Rs 2 crore looted from atm van in mumbai

Rs 2 crore looted, bank of baroda, ATM van, ATM van robbery in broad daylight, Mumbai Deputy Commissioner of Police, mumbai dcp Virendra Mishra, Rupees two crores was looted, suburban Vile Parle, Mumbai Police confirmed robbery,

Mumbai Police have confirmed a robbery of an ATM van in broad daylight on Friday. Deputy Commissioner of Police Virendra Mishra said that more than half of a sum of Rupees two crores was looted from the van in suburban Vile Parle by four persons, including one of the employees of the security firm.

సినిమా ఫక్కీలో రూ.2 కోట్ల రూపాయల దోపిడి

Posted: 01/17/2015 08:22 PM IST
Rs 2 crore looted from atm van in mumbai

పట్టపగలు ముంబైలోని ఎటిఎం వ్యాన్‌లో దోపడీ జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఎటిఎం వ్యాన్‌లో సగం డబ్బులు, దాదాపు రూ. 2 కోట్లను దుండగులు దోచుకెళ్లారని డిప్యూటీ పోలీసు కమిషనర్ వీరేంద్ర మిశ్రా చెప్పారు. ముంబైలోని సబర్బన్ విలే పార్లెలో నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పిడినట్లు ఆయన తెలిపారు. దోపిడీకి పాల్పడినవారిలో సెక్యూరిటీ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఎటిఎం వ్యాన్ లోయర్ ప్యారెల్ ఏరియా నుంచి బయలుదేరింది. దాన్ని ఓ కారు అడ్డగించింది. ముగ్గురు వ్యక్తులు అందులోంచి దిగి డబ్బులు ఎత్తుకుని పారిపోయినట్లు మిశ్రా చెప్పారు. తమకు లభించిన క్లూస్ ఆధారంగా ప్రతి కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దొంగలతో చేతులు కలిపిన సెక్యూరిటీ గార్డును సాద్రే ఆలంగా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో ముగ్గురి కోసం కూడా పోలీసులు వేట సాగిస్తున్నారు. ఎంటిఎం వ్యాన్‌లో రెండు కోట్ల 36 లక్షల రూపాయల ఉన్నాయని, అందులోంచి కోటీ 95 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని మిశ్రా చెప్పారు. మత్తు కలిపిన ద్రవపదార్థాలను దుండగులు వాడినట్లు గుర్తించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai  maharastra  atm  

Other Articles