Rss unsatisfied with kiran bedi cm candidature in delhi elections

Kiran Bedi, Kiran Bedi delhi cm, Kiran Bedi bjp, RSS on Kiran Bedi, RSS Delhi cm candidate, Kiran Bedi constituency, Kiran Bedi on delhi elections, Kiran Bedi on Arvind Kejriwal, Kiran Bedi latest, Delhi Elections, BJP on Delhi Elections, latest news

RSS unsatisfied with Kiran Bedi CM Candidature in Delhi Elections : BJP Parent organization RSS not satisfied with Kiran Bedi CM Candidature from party. RSS Wants to put sangh person or bjp origin candidate for CM post.

బీజేపి నిర్ణయంపై సంఘ్ అభ్యంతరాలు

Posted: 01/17/2015 09:30 AM IST
Rss unsatisfied with kiran bedi cm candidature in delhi elections

ఢిల్లీ ఎన్నికలు మరోసారి బీజేపి-ఆర్ఎస్ఎస్ సంబంధాలను నిరూపించే అంశంగా మారనున్నాయి. బీజేపి సొంత నిర్ణయం తీసుకుంటుందా.., లేక పేరంట్ సంస్థ లాంటి ఆర్ఎస్ఎస్ చెప్పిన మాటనే వింటుందా తెలియాల్సి ఉంది. అసలు విషయానికి వస్తే.., హస్తిన పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలదళం, పార్టీ నుంచి మంచి అభ్యర్ధులను బరిలోకి దింపుతోంది. ముఖ్యంగా ఆప్ కు పోటిగా పట్టున్న నేతలకు టికెట్లు కేటాయిస్తోంది. ఇక బీజేపిలో చేరిన మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి హస్తిన ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం అవుతోంది. ఆమె ఎవరిపై, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు వంటి అంశాలను పార్టీ ఇంకా ప్రకటించలేదు. కానీ బేడికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఆమెనే బీజేపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారని స్పష్టం అవుతోంది.

కిరణ్ బేడి ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్ధి అవుతారని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంపై సంఘ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. సంఘ్ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం లేకుండా ఇతరులకు ఇవ్వటం ఏంటని అభ్యంతరాలు వస్తున్నాయి. అంతేకాకుండా తొలి నుంచి పార్టీలో ఉన్న నేతలను కాదని కొత్తగా వచ్చిన నేతకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించటంపై సంఘ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరి దీనిపై బీజేపి ఏ నిర్ణయం తీసుకోనుందో తెలియాల్స ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Bedi  RSS  Delhi Elections  

Other Articles