Salman khan cannot travel to uk after sc order

Salman Khan movies, Salman Khan hits, Salman Khan latest updates, Salman Khan latest news, salman khan poaching case, salman khan black buk hunting case, Supreme Court, Salman Khan, poaching case, black buck hunting case, Rajasthan High Court, rajasthan government, S

The Supreme Court on Wednesday quashed the suspension of Bollywood actor Salman Khan’s conviction ordered by the Rajasthan High Court in the 1998 poaching case.

సల్మాన్ ఖాన్ విదేశీయానం ఎలా చేస్తున్నాడో చెప్పండి..

Posted: 01/14/2015 11:48 AM IST
Salman khan cannot travel to uk after sc order

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థాపం పక్కన పెట్టింది. సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లవచ్చని రాజస్తాన్ హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పునర్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాజస్తాన్ హైకోర్టును ఆదేశించింది.

కాగా ఈ కేసులో సల్మాన్కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్ఖాన్కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం నవంబర్ 12న ఆ శిక్షపై స్టే విధించింది. దీంతో సల్మాన్ ఖాన్ విదేశాలు వెళ్లడం ఇక కష్టమేనని తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Salman Khan  poaching case  black buck hunting case  Rajasthan High Court  

Other Articles