Internal feud in dmk upsets karunanidhi

DMK, M karunanidhi, former chief minister, DmK party president, Dmk party meeting, mylapore, DMK president Karunanidhi, karunanidhi lashes on state government, karunanidhi lashes on central government, karunanidhi lashes on media, karunanidhi family disputed, no disputes in karuna family,

A big political meeting is held by DmK at the Mangollai area in Mylapore. DMK president, M. Karunanidhi had lashed out at state and central government

కుట్రదారులు, కుతంత్రులు నాశనమైపోతారు..

Posted: 01/14/2015 06:48 PM IST
Internal feud in dmk upsets karunanidhi

తమిళనాడు రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన డీఎంకే అదినేత, మాజీ ముఖ్యమంత్రి కురుణానిధి.. వృద్దాప్యం మీదపడటంతో వైరాగ్యంలోకి జారుకుంటున్నారు. తన వాగ్ధాటితో ప్రజలను తనవైపుకు తిప్పుకుని.. ప్రతిపక్షాలకు నీళ్లు తాగించిన తమిళనాట రాజకీయ ధురంధరుడు శాపనార్థలకే పరిమితమవుతున్నారు. ఓ వైపు పార్టీలో ఇంటి పోరు అధికం కావడంతో పార్టీ శ్రేణులు వర్గాలుగా వీడిపోతుండగా, మరోవైపు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులపై అవినీతి కేసులు, విచారణల పర్యం కొనసాగుతుండడంతో.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలోకి కరుణానిధి జారుకున్నారు.

తన పార్టీని నిర్వీర్యం చేయడానికి కుట్రలు, కుతంత్రాల చేస్తున్న వాళ్లు.. కుయుక్తులు పలుకుతున్న వాళ్లంతా నాశనమైపోతారు! అని ఆయన శాపనార్థాలు పెట్టారు. డీఎంకే ఏ ఒక్కిర పార్టీ కాదని తమిళుల అందని పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. వరుస పతనాలతో డీలా పడ్డ డీఎంకేను కరుణానిధి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే పనిలో పడ్డారు. అదే సమయంలో డీఎంకేకు వ్యతిరేకంగా మీడియాల్లో కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, కరుణానిధి కుటుంబంలో విబేధాలు తాండవం చేస్తున్నాయన్న ప్రచారం జోరందుకుంది.

స్టాలిన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించండంలో కరుణానిధి వెనక్కు తగ్గడం మరింత వివాదానికి ఆజ్యం పోసిందని, డీఎంకే మరింతగా చలికిలబడే స్థాయికి చేరిందన్న కథనాలు కరుణానిధిలో ఆగ్రహాన్ని తెప్పించాయి. తన కుటుంబం మీద, డీఎంకేకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని మైలాపూర్‌లో బహిరంగ సభలో కరుణానిధి, తన ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో ప్రసంగం చేశారు. డీఎంకేను నిర్వీర్యం చేయాలన్న కుట్రలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేసే వాళ్లందరూ నాశనమవుతారని శాపనార్థం పెట్టారు. తాను ఏ సమయంలోనూ డీఎంకే తన పార్టీ అని వాఖ్యానించ లేదని, మన పార్టీ మన కళగం అని చెప్పుకునే వాడినన్నారు.

డీఎంకే ఎక్కడ బల పడుతుందోనన్న భయం కొందరిలో నెలకొందని, అందుకే మన పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు కుత్రంతాలు రచించే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నో ఓటముల్ని ఎదుర్కొని మళ్లీ విజయపు బాటలో నడిచిన పార్టీ డీఎంకే అన్న విషయాన్ని ఆ దుష్ట శక్తులు గుర్తెరగాలని హితవు పలికారు. డీఎంకే వాల్ పోస్టర్ పార్టీ కాదని, స్వలాభం కోసం ఆవిర్భవించిన పార్టీ కూడా కాదని, ప్రకటనలు, పబ్లిసిటీతో పబ్బం గడుపుకునే పార్టీ కాదని, ద్రవిడుల జీవితాల్లో వెలుగు లక్ష్యంగా, ద్రవిడ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పార్టీ అన్న విషయాన్ని గ్రహించండంటూ కార్యకర్తలను కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Internal feuds  M Karunanidhi  DMK  mylapore  

Other Articles