Man arrested for sending objectionable message on whatsapp

Man arrested in UP, uttar pradesh police, man held spreading objectionable messages, objectionable messages against a religion, objectionable messages to mobile phones, objectionable messages on what'saap, man held in nanpara area, man held for creating tensions, Superintendent of Police R L Verma, Rajesh Rastogi arrested,

A man was arrested for allegedly spreading objectionable messages against a religion on mobile phone application WhatsApp leading to tension in Nanpara area here, police said on Tuesday.

మాయదారి రోగం ఫేస్ బుక్ నుంచి వాట్సప్ కు సోకింది..

Posted: 01/13/2015 05:26 PM IST
Man arrested for sending objectionable message on whatsapp

మాయదారి రోగం ఎక్కడికెళ్లిన తన పని తాను చేస్తూనే వుంది. అదేంటి అంటరా..? శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో కొంచె ఖరీదైన ఫోన్ వుంటే చాలు అదే యావత్ ప్రపంచాన్ని మనకు గుప్పిట్లో పెట్టినట్లే. అయితే అందివచ్చిన ఈ మార్పులు మనిషి మనోవికాసానికి దోహదపడటంలో తప్పులేదు.. కానీ. వాటిని కూడా తన వక్రబుద్దితో తప్పుడు పనులకు వినియోగిస్తేనే తప్పు. అంతేకాదు నేరం కూడా. ఈ తరుణంలో సోషల్ మీడియాతో ప్రభుత్వాలు ఏర్పడతాయని, నిలబడతాయని కూడా రుజువైంది. భారత ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియాను వినియోగించుకుని ముప్పై ఏళ్ల తరువాత మూడింట రెండోంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలోని షేస్ బుక్ ఇన్నాళ్లు అభ్యంతకర ఫోస్టింగ్లలకు కేంద్రంగా మారింది.  క్రమంగా వాటిపై చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు ఆ మాయదారి రోగం వాట్సఫ్ కు సోకింది. తాజాగా ఓ మతానికి సంబంధించి వాట్సప్ లో అభ్యంతరకర సందేశాలు పంపడంతో ఉత్తర్ ప్రదేశ్ లోని నాన్పరా ప్రాంతంలో పలు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో ఇరు వర్గాలు శాంతించాయి.

వివరాల్లోకి వెళ్తే..రాజేష్ రస్తోగి అనే వ్యక్తి తన మొబైల్ అప్లికేషన్ వాట్సప్  నుంచి మతానికి సంబంధించిన  మెస్సెజ్ లను పదే పదే పంపుతున్నాడు. ఈ సందేశాలతో నాన్పురాలో కలకలం రేగడంతో పాటు, కొన్ని వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేశారు. మతానికి తప్పుడు ప్రచారం చేస్తున్నకారణంగా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ ఆర్.ఎల్ వర్మ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Superintendent of Police R L Verma  Rajesh Rastogi  arrest  

Other Articles