Fine for dumping in yamuna

Yamuna, National Green Tribunal, Delhi bridges, Yamuna river, Justice Swatanter Kumar, Yamuna Action Plan, dumping Yamuna river, fine for dumping in yamuna, Rs 5000 fine for dumping, Yamuna cleaning, Yamuna pollution, Maili Se Nirmal Yamuna project

After humongous amount of money going down the drain, so to speak, in the name of cleaning Yamuna, the National Green Tribunal on Tuesday directed against throwing of waste and debris in it and redefined the limit of flood plains.

యుమునా నదిలో చెత్త వేసే దమ్ముందా..?

Posted: 01/13/2015 06:49 PM IST
Fine for dumping in yamuna

యమునా నది, ప్రపంచ ఏడో వింతైన తాజ్ మహల్ అందాలను ఒకనాడు తనలో చూసుకుంటూ మురిసిపోయే నది. అంతేకాదు సాగు, తాగు నీరుకు ఆలవాలమైన నది. అలాంటి నది ఇప్పుడు కంపుకొడుతూ.. పర్యావరణానికి సవాల్ విసరుతోంది. గంగా యమునా నదుల ప్రక్షాళన చేసి నదీ జలాలను కలుషితం కాకుండా చేసేందుకు, నాటి వైభవాన్ని తిరిగి సంతరించుకునేలా.. ప్రభుత్వం గత కొన్ని ఏళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలు సానుకూలమై ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు మారినా.. నదీజలాల కాలుష్యం మాత్రం తరగడం లేదు.

కాగా, ఈ పరిస్థితిని మార్చేందుకు పూనుకుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్. యమునా నదిలో చెత్త, చెదారాన్ని వేయకుండా ప్రజలను నిలువరింపజేసేందుకు కొంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. యమునా నది మనది దానిని పవిత్రంగా వుంచుదామన్న ప్రచారంతో ప్రజల్లో కదిలిక కరువైంది. దీంతో మరో రకమైన ప్రచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కదిలింది. యమునా నదిలో చెత్త వేసే దమ్ముందా అంటూ ప్రజలలో కదిలికను తీసుకురానుంది. దీనిని విస్తారంగా ప్రచారం చేయడంతో స్థానికులు కూడా చెత్త వేసేందుకు జంకుతారని అభిప్రాయానాకి వచ్చింది.

దీనికి కారణమేమిటంటే..యమునా నదిలో చెత్త చెదారం వేస్తూ పట్టుబడితే వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నిర్ణయించారు. ఆయన నేతృత్వంలోని ట్రిబ్యూనల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో యమునా నదిని మరో రెండేళ్లలో కాలష్య రహితంగా చేసే పథకం మైలీ సే నిర్మల్ యమునా ప్రాజెక్టు అవిష్కృతం కానుందని తెలిపారు. అంతేకాదు శిధిలాలను యమునా నదిలో వేసే వారికి 50  వేల రూపాయల జరిమానాను కూడా విధించాలని నిర్ణయించారు. ఇప్పుడు చెప్పండి మీకు యమునా నదిలో చెత్త వేసే దమ్ముందా..?

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NGT  Yamuna  Yamuna cleaning  Yamuna pollution  

Other Articles