Sanjay dutt furlough ends goes back to yerwada jail

Actor Sanjay Dutt, Sanjay Dutt granted furlough, Sanjay Dutt flashes abs, sanjay dutt furlough, sanjay dutt ouf of yerawada jail, sanjay dutt granted temporary leave, sanjay dutt at home, sanjay dutt arms act case, sanjaydutt convicted, sanjay dutt christmas holidays, sanjay dutt furlough, sanjaydutt furlough extention, sanjaydutt goes to jail, sanjay furlough extension rejected, sanjay dutt out of jail,

Bollywood actor Sanjay Dutt, who is out of jail on a 14-day furlough, today left his home here to surrender himself, after prison authorities refused to extend his leave.

తాత్కాలిక సెలవుల తరువాత మళ్లీ జైలుకు..

Posted: 01/08/2015 06:56 PM IST
Sanjay dutt furlough ends goes back to yerwada jail

క్రిస్టమస్ సహా కొత్త సంవత్సరపు వేడుకలను కుటుంబ సభ్యులతో గడిపిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇవాళ తిరిగి యర్రవాడ జైలుకు వెళ్లారు. రెండు వారాల ఫర్ లాఫ్ ముగియడంతో ఆయన కుటుంబసభ్యుల వీడ్కోలు మధ్య జైలుకు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అటు న్యాయస్థానంతో పాటు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం సంజయ్ దత్ పేరోల్, ఫర్ లాఫ్ లపై విచారణ జరుపుతున్న సమయంలో తనకు తాత్కాలిక సెలవులను మరో పక్షం రోజులు పొడగించాలని సంజయ్ దత్ పెట్టకున్న దరఖాస్తుపై జైలు అధికారులు స్పందించకపోవడంతో.. ఆయన ఇవాళ తిరిగి జైలు అధికారులకు సరండర్ కానున్నారు. పుణే జైలు నుంచి ముంబైకి ఎటువంటి పత్రాలు అందలేదని తెలిపారు.

1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లు కేసుకు సంబంధించి... అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు 2013 డిసెంబర్ 24న అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందులో గతంలో శిక్షణు అనుభవించిన కాలాన్ని మినహాయించిన పిమ్మట సంజయ్ దత్ మరో మూడు ఏళ్ల ఎనమిది మాసాల శిక్షను పూర్తి చేయాల్సి వుంది. శిక్షాకాలాన్ని పూర్తి చేసే క్రమంలో పుణెలోని ఎరవాడ జైలులో వున్న సంజయ్ దత్ ఇప్పటికే 118 రోజుల పాటు పేరోల్, ఫర్ లాఫ్ పేరుతో బయటకు వచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అదేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay dutt  furlough  yerawada jail  

Other Articles