Some statements damaging bjp admits amit shah

BJP national president Amit Shah, Some statements damaging BJP, amit shah admits on damages to party, religious conversions damaging BJP, Amit shah, PM narendra modi, narendra modi, BJP Mps, BJP leaders, make in india, mission Telangana 2019, dissatisfaction on telangana party leaders,

Bharatiya Janata Party (BJP) president Amit Shah admitted that the statements of some party leaders on religious conversions were damaging the party's image.

ITEMVIDEOS: కొందరి నేతల వ్యాఖ్యాలతో బీజేపికి నష్టం వాటిల్లుతుంది..

Posted: 01/08/2015 06:48 PM IST
Some statements damaging bjp admits amit shah

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని బీజేపీలో చేర్పించటమే తమ లక్ష్యమని ఆయన చెప్పుకోచ్చారు. తెలంగాణలో 35 లక్షల సభ్యత్వాలను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఆన్లైన్లో పార్టీ సభ్యత్వానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 22 శాతం ఓట్లు వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా పురోగమించాలని సూచించారు.

యూపీఏ హయాంలో ధరలు విపరీతంగా పెరిగాయని... బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. మేకిన్ ఇండియాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. మరోవైపు పలువురు పార్టీ నేతల వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దని, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలను తీసుకురావద్దని ప్రధాని మోడీ తమ పార్టీ నేతలు సూచించినా.. పలువురు మాత్రం ఇంకా మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి నష్టం వాటిల్లే చర్యలకు పూనుకుంటున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ కోర్ కమిటీపై అమిత్ షా కన్నెర్ర

'మిషన్ తెలంగాణ-2019' లో భాగంగా తెలంగాణ కోర్ కమిటీ సభ్యులతో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణలో అవకాశాలు ఉన్నా ఎందుకు పార్టీ పుంజుకోకపోవటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదును ఎందుకు పూర్తి చేయలేకపోయారని, తెలంగాణ కోసం పోరాడినా ఎందుకు ఫలితాలు సాధించలేకపోయారని అమిత్ షా కోర్ కమిటీని ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉన్నా నాయకత్వం సరిగా పని చేయటం లేదని, పార్టీ కేడర్ను వాడుకోవడంలో నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం 30 లక్షల మంది సభ్యత్వం నమోదు చేయాలని, ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా ఈ భేటీలో సూచించినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharatiya Janata Party  BJP  Amit Shah  Sakshi Maharaj  Mission telangana-2019  

Other Articles