Mamata banerjee apologizes to industry for the past

mamata banerjee apologizes, mamata apologizes to industrialists, mamata apology on previous goverment mis mangemt, industrialists financial mismanagement, west bengal financial mis management, mamata urged businessmen to invest in bengal, mamata apology for Left Front regime mistakes, mamata kolkata industralist summit, west bengal chief minister mamata banerjee,

West Bengal chief minister Mamata Banerjee on Thursday apologized to industrialists for the "financial mismanagement" witnessed during the Left Front regime and urged businessmen to invest in her state.

జరిగిన తప్పులకు క్షమించండీ.. ప్లీజ్ : ముఖ్యమంత్రి

Posted: 01/08/2015 09:52 PM IST
Mamata banerjee apologizes to industry for the past

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సభా ముఖంగా పారిశ్రామిక వేత్తలక, పెట్టుబడిదారులకు క్షమాపణలు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ‘బెంగాల్‌ గ్లోబల్‌ సమ్మిట్‌' పేరిట పెట్టుబడిదారుల సదస్సును పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. అయితే ఇవాళ పారిశ్రామిక వేత్తల గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ఆమె హజరై ప్రసంగించారు. ముందుగా ఆమె పారిశ్రామివేత్తలకు క్షమాపణలు చెప్పారు. వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిర్వహణ లోపాలకు తాను క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు.

ఇకనైనా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అమె పారిశ్రామిక వేత్తలను, పెట్టబడి దారులను కోరారు. గతం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను మరిచిపోవాలని, గతంలో జరిగిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఆ గాయాలు పునారవృతం కాకుండా జరిగిన చెడును వదిలేద్దామని, రేపటి గురించి ఆలోచించుదామన్నారు మమతా బెనర్జీ. పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఇక వారు ధైర్యంగా పెట్టుబడులను పెట్టవచ్చునని కోరారు. వామపక్ష్గత ప్రభుత్వం కారణంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం కేంద్రం 21వేల కోట్ల రూపాయలు, గత ఏడాది, 25వేల కోట్లు, ఈ ఏడాది 28వేల కోట్ల రూపాయలను తీసుకుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రజల కోసం ఎలా పని చేయాలో అర్థం కావడం లేదని మమత అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata banerjee  west bengal  investors  kolkata  political  kolkata summit  

Other Articles