Paris fresh firing update

Paris Fresh firing, Paris fresh firing updates, Paris latest shooting, Paris shootings, Paris shooting updates, Paris shooting suspects, charlie hebdo shooting, charlie hebdo paper attack, latest terrorists attacks, world latest news

Paris latest Shooting update : Paris shivered for the second time after charlie hebdo paper office attack. terrorists fires on police in south paris populated area. police identified key person involved in the firing

మరోసారి ప్యారిస్ లో కాల్పుల మోత

Posted: 01/08/2015 02:44 PM IST
Paris fresh firing update

ఉగ్రవాద దాడితో వణికిపోతున్న ప్యారిస్ పై తీవ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. 12మందిని బలిగొనన్న మరుసటి రోజునే కాల్పులకు తెగబడ్డారు. తొలి రోజున పత్రికా కార్యాలయంపై దాడికి దిగితే.., ఇవాళ పోలిసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. అయితే ఈ రెండు ఘటనలకు సంబంధాలు ఉన్నట్లు పోలిసులు నిర్ధారించకపోయినా.. అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.., సౌత్ ప్యారిస్ లో జనరద్దీ గల ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలిసులు గాయపడ్డారు.

కాల్పుల విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తాజా కాల్పుల ఘటనలో కీలక నిందితుడిని గుర్తించినట్లు భద్రతా వర్గాలు చెప్తున్నాయి. అటు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలిసులు అప్రమత్తంగా వ్యవహరించటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం తగ్గిందని చెప్తున్నారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనతో ప్యారిస్ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే నగరంలో కాల్పుల మోతలతో కలత చెందుతున్నారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని... పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రధాని హోలండ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris Fresh shooting  charlie hebdo  world latest  

Other Articles