Deputy chief minister backs bribe takers

Telangana deputy chief minister rajaiah, deputy cm rajaiah backs hospital staff, bribe in government hospitals, bribe to hospital staff, bribing hospital staff not wrong, rajaiah, telangana dy cm rajaiah, rajaian at adilabad, rajaiah on hospital staff, rajaiah backs hospital staff, rajaiah backs hospital staff bribe

Telangana deputy chief minister backs Hospital staff, says nothing wrong in demanding Rs. 100, 200

ITEMVIDEOS: లంచం అడిగితే అవినీతి పరులా..? ఢిఫ్యూటీ సీఎం

Posted: 01/08/2015 04:09 PM IST
Deputy chief minister backs bribe takers

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజ య్య సంచలన వ్యాఖ్యాలు చేశారు. లంచం అడిగితే తప్పేముంది అని లంచావతారాలను వెనకేసుకోచ్చారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబిక్కుతోంది. ప్రైవేటు ఆస్పత్రులు పేదలను డబ్బు కోసం ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని పక్కనబెడితే.. అసలు ఏమాత్రం డబ్బులు పేట్టలేని కడు పేదలే.. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటారు. అది కూడా అత్యవసరమైన సమయంలో మాత్రమే వారు అస్పత్రులకు ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రైవేటు అస్పత్రులలో వైద్యం చేయించుకోవాలంటే.. సిబ్బందిని అడ్డం పెట్టుకుని ఓ వైపు వైద్యులు డబ్బులు లాగుతున్న పలు సంఘటనలు కూడా వెలుగు చూశాయి.

ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉపముఖ్యమంత్రివర్యులు రాజయ్య స్వతహాగా వైద్యులు కావడంతో.. పేదల ఆరోగ్యాన్ని అలక్షం చేసిన వారిని క్షమించనూ అని చేసిన ఏకంగా వైద్యులకు హెచ్చరికలు చేసి.. ప్రజల పక్షపాతి అనిపించుకున్నారు.  మాసాలు గడవగానే అమాత్యులు మరో కొత్త రాగం ఆలపించారు. అయితే ఇది కోంత వివాదాస్పద రాగంగానే మారింది. ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదని, అలా అడిగినవారిని అవినీతిపరులుగా పరిగణించొద్దని చెప్పుకొచ్చారు. దీంతో ఖంగుతిన్న మీడియా నోళ్లు వెళ్లబెట్టింది.

దీనావస్థలో వున్న పేదలు వైద్యం కోసం పదో పరకో దాచుకుని, రోగిని ఆస్పత్రికి తరలిస్తే.. వారి చూడటానికి ఇరవై రూపాయలు, అక్కడే వుండటానికి యాహై రూపాయలు, ఇలా పేదల సొమ్మను స్వాహా చేస్తున్న సిబ్బందిని వెనకేసుకొచ్చారు. లంచం ఏ రూపంలో వున్నా లంచమే. లంచం ఎంత అడిగారన్నది ముఖ్యం కాదు.. లంచం లంచమేగా.. మరి ఈ విషయాన్ని మరచి మీకు సేవలు చేస్తున్న వాళ్లకు 100, 200 ఇస్తే తప్పులేదన్న మంత్రివర్యులు ఎలా అన్నారు. రోగితో పాటు అక్కడే వుంటే బాధిత అటెండర్ల కష్టాలు ఎలా తీరుతాయి. రోజుకు వంద, రెండుదంలు ప్రతీ రోగి నుంచి తీసుకుంటే అది ఎంత మొత్తం అవుతుంది. నెల వారి జీతం కన్నా అధికంగా వారు లంచాలమీదే బతికేస్తున్నట్లు కాదా..? ఈ విషయాన్ని మరచి అస్పత్రి సిబ్బందిని ఉపముఖ్యమంత్రి రాజయ్య వెనకేసుకురావడం ఎంత వరకు సమంజసం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : THATIKONDA RAJAIAH  doctors  flu  private hospitals  

Other Articles