Dhoni retirement reasons

Dhoni retirement, Dhoni retirement reasons, Dhoni retirement latest updates, Dhoni test cricket retirement, Dhoni retirement latest, Dhoni retirement updates, indian cricket team, indian cricket latest, India vs Australia test matches, India vs Australia test updates

dhoni retirement reasons : Team India cricket captain Dhoni retired from test cricket. Many reasons involved in Dhoni test cricket retirement like serial of rumors and team facing defeats in recent matches. dhoni retired because virat kohli is getting ready to take captaincy, mahendra observed that and he him self make a side

ధోని రిటైర్మెంట్ కారణాలివే..?

Posted: 12/31/2014 09:02 AM IST
Dhoni retirement reasons

తన అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. మహేంద్రుడి నిర్ణయంతా అంతా ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. సహచర క్రీడాకారులు కూడా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం పట్ల విస్మయ వ్యక్తం చేస్తున్నారు. సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలేమిటా అని విశ్లేషణలు మొదలయ్యాయి. క్రీడా విశ్లేషకులు చెప్తున్న ప్రకారం ధోని రిటైర్మెంట్ కు ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.

తన బ్యాటింగ్, కీపింగ్, టీం మేనేజ్ మెంట్ తో ఒకప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ధోని కొద్దికాలంగా విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ఆటతీరు తగ్గటంతో పాటు, జట్టు కూడా కొద్దికాలంగా ఓటములు ఎదుర్కుంటోంది. మహేంద్ర ఉంటే విజయం మనదే అనే ధీమా భారత క్రికెట్ జట్టులో పోయింది. ఇదే సమయంలో ధోని తరుచుగా సెలవుులు తీసుకుంటున్నాడు.జట్టుుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి వరుసగా లీవ్ లు తీసుకోవటంపై సీనియర్ల నుంచి విమర్శలు వచ్చాయి.

దీనికి తోడు ఈయనపై ఈ మద్య ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, కమర్షియల్ కోణాలు అని విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఇదే సమయంలో విరాట్ కొహ్లీ ధోనికి పక్కలో బల్లెంలా తయారవుతున్నాడు. కొద్దికాలంగా పట్టు పెంచుకుంటూ వస్తున్న కొహ్లీ.., కెప్టెన్సీ చేసే స్థాయికి ఎదిగాడు. వారసుడు తయారయ్యాక ఎక్కువ రోజలు ఉండటం మంచిది కాదు. పక్కకు తప్పుకోమని చెప్పే ముందు తానే గౌరవంగా తప్పుకోవటం ఉత్తమంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ముందు టెస్ట్ క్రికెట్ కు ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యి తొలి నిర్ణయం ప్రకటించాడని అంటున్నారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhoni  dhoni retirement  indian cricket updates  

Other Articles