Khuntia comments on trs government

Khuntia, AICC Khuntia, Khuntia congress leader, Khuntia on Telangana Government, TRS Government problems, Telangana government latest, telangana updates, kcr offers to employees, kcr on telangana special increment, kcr releases tngo diary, tngo diary 2015, kcr met kodandaram, kcr latest updates, telangana congress latest

Khuntia comments on TRS government : AICC Secratary Khuntia says telangaa government will collapse by itself with public anger policies. TRS government offers special incentives or employees if they bring more income to state treasury

టీఆర్ఎస్ కు అధికార గండం.., కేసీఆర్ స్పెషల్ ఆఫర్లు

Posted: 12/31/2014 08:31 AM IST
Khuntia comments on trs government

తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ కార్యదర్శి కుంతియా సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ సర్కారు ఐదు సంవత్సరాలు కొనసాగదన్నారు. మద్యలోనే కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కుంతియా.., ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను ఎవరూ కూల్చనవసరం లేదు.., వాటంతట అవే కూలిపోతాయని చెప్పారు. ఓ వైపు ఇతర పార్టీల నుంచి నేతలంతా కారు ఎక్కి ఖుసీ అవుతుంటే, కుంతియా ఈ కామెంట్లు చేయటంతో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ఆఫర్లు ప్రకటించటంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో కొత్త ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ సారి కేవలం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ కానుక ఇచ్చారు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెస్తే, ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. టీఎన్జీవో డైరీ ఆవిష్కరణలో ఈ కామెంట్లు చేశారు. ప్రైవేటు, మార్కెటింగ్ రంగంలో టార్గెట్  చేరితే ఇన్సెంటివ్ లు వస్తాయని మనం విన్నాం. కానీ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ఉంటాయని కేసీఆర్ ప్రకటన చూస్తే తెలుస్తోంది. సీఎం హామితో ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు, ఈ ఏడాది టాక్స్ లే కాకుండా..., రాబోయే పదేళ్లకు ఒకేసారి ఇఫ్పుడే కట్టేయమంటారో ఏమో.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  Khuntia  Telangana latest  

Other Articles