Telangana chief minister k chandrasekhara rao is going to expand his cabinet on december 16th

telangana chief minister, k chandra shekar rao, expand council of ministers, trs party official, Council of Ministers of Telangana will be expanded, The Telangana cabinet expansion came

Telangana Chief Minister K. Chandrasekhar Rao is expanding his Cabinet by inducting at least six new Ministers into his cabinet.

తెలంగాణా మంత్రి వర్గ తుది కసరత్తు.. భగ్గుమంటున్న అసంతృప్తి

Posted: 12/15/2014 10:44 AM IST
Telangana chief minister k chandrasekhara rao is going to expand his cabinet on december 16th

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి వర్గ విస్తరణ తల నొప్పులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే మంత్రి వర్ణ విస్తరణ తేది ఖరారు కావటం తో ముఖ్యమంత్రి మరియు పార్టీ సీనియర్లు కలిసి విస్తరణ పై తుది కసరత్తు చేస్తునట్లు సమాచారం. కొందరి పేర్లు ఇప్పటికే అధికారికంగా ఖరారు అయ్యాయి. వారిలో ఖమ్మం నుండి తుమ్మల్ నాగేశ్వర్ రావు, మహబూబ్  నగర్ జిల్లా నుండి జూపల్లి కృష్ణ రావు, డాక్టర్ లక్ష్మ రెడ్డిల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తుంది. గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి తుది కసరత్తు పూర్తి అయిన తర్వాత అధికారికంగా జాబితాను పంపిస్తారు.

ఈ విస్తరణలోఆరుగురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురి పేర్లు ఖరారు అయిన నేపథ్యం లో మరో ముగ్గురు పేర్లు కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరో ముగ్గురిలో..., గిరిజన కోటాలో వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎం.ఎల్. ఏ అజ్మీరా చందు లాల్  పేరు దాదాపు ఖాయమన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఆదిలాబాద్ నుండి ఇంద్ర కరణ్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు  తెలుస్తుంది.

హైదరాబాద్ కి చెందిన వలస నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రంగా చర్చ నడుస్తునట్లు సమాచారం. టి.డి.పి నుండి హామీ పై తెరాస లోకి వచ్చిన తలసాని పేరు కూడా మంత్రి పదవి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నగరం లో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా తలసాని కి పేరు ఉండటం తో తలసాని పేరు పై తీవ్ర చర్చ నడుస్తుంది.

మహిళా ఎం.ఎల్. ఏ లలో కొండ సురేఖ పేరు తీవ్రంగా వినిపిస్తుంది. తెరాస పార్టీ లో ఇతర సీనియర్ మహిళా ఎం.ఎల్. ఏ లు ఉన్నప్పటికీ, సురేఖ సీనియర్ కావటం తో ఆమెకు దాదాపుగా ఖాయమని ప్రచారం జరుగుతుంది.

ఇవన్ని పక్కన పెడితే ఇప్పటికే అసంతృప్తులు భగ్గుమంటున్నారు. సీనియర్ ఎం.ఎల్. ఏ కొప్పుల ఈశ్వర్ కి చీఫ్ విప్ పదవి ఇవ్వటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి తో సమావేశం అయి తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు కెసిఆర్ నుండి వ్యక్తిగతంగా కాల్ వెళ్ళినట్లు చెప్తున్నారు. ఇతర నేతలు గంప గోవర్దన్ మరియు శ్రీనివాస్ గౌడ్ కూడా తమకు పార్లమెంటరీ కార్యదర్శి హోదా ఇవ్వటం పై కొంత నిరాశ తో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికే ఈ అసంతృప్తులు పార్టీ కి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించటం గమనార్హం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles